హర్షకుమార్, వంగవీటి.. వాట్ నెక్ట్స్?

దశాబ్దాల పాటు తాము దుమ్మెత్తి పోసిన పార్టీలోకి వచ్చిచేరారు. తన తండ్రిని తెలుగుదేశం పార్టీనే హత్య చేయించిందని ఇన్ని రోజులూ వ్యాఖ్యానించిన వంగవీటి రాధా అదే పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక కాంగ్రెస్ నేతగా తెలుగుదేశంపై గట్టిగా పోరాడిన నేపథ్యం ఉన్న హర్షకుమార్ బాబు పాదాలకు వందనం చేసి మరీ తెలుగుదేశం పార్టీలోకి చేరారు. తెలుగుదేశంలోకి చేరినట్టుగా చెప్పుకోవడానికి.. జగన్ విషయంలో కూడా అవాకులు చవాకులు పేలారీయన!

కట్ చేస్తే... చంద్రబాబు అంటే ఏమిటో రెండో రోజుకే హర్షకుమార్ కు అర్థమై ఉండాలి! అమలాపురం ఎంపీ టికెట్ జాక్ పాట్ గా తగిలినట్టే అని చేరిన హర్షకుమార్ కు బాబు మార్కు ట్రీట్ మెంట్ తప్పలేదు. హర్షకుమార్ కు టికెట్ ఇవ్వకుండా, మళ్లీ బాలయోగి తనయుడికే బాబు అమలాపురం ఎంపీ టికెట్ ఖరారు చేశారు. బాలయోగి తనయుడికి టికెట్ ఇస్తే గెలుపు అనుమానమే అనే భావనతో హర్షకుమార్ ను తోడ్కొని వచ్చారు. తీరా చేర్చుకుని హర్షకు ఝలక్ ఇచ్చారు.

ఆయన పరిస్థితే కాదు.. వంగవీటి రాధా కథ కూడా ఇదే. రాధాపై చంద్రబాబుకు ప్రేమ వచ్చేసిందని, ఆయన ఎక్కడ ఉన్నా వెంటనే వచ్చి బాబును కలవాలని, ఎంపీ టికెట్ ఎదురుచూస్తోందని.. అనుకూల మీడియా బాకా ఊదింది. 'రాధా బాబూ.. వచ్చేయమ్మ.. నీకు టికెట్ ఎక్కడ కావాలి.. అనకాపల్లా, నరసరావు పేటా..' అని బాబు దిగులుతో కోరినట్టుగా టీడీపీ మీడియా ప్రచారం చేసింది.

తీరాచూస్తే.. రాధాకు దక్కింది ఏమీలేదు. ఏదో తమ మానాన తాము ఉన్న వారిని మీడియా ద్వారా లీకులు ఇచ్చి చంద్రబాబు నాయుడు తీసుకుని వచ్చారు. హర్షకుమార్ కోసం అమలాపురం ఎంపీ టికెట్ ఎదురుచూస్తోందని, రాధా కోసం రెండు టికెట్లు ఎదురుచూస్తున్నాయని బాబు తన మీడియా ద్వారా లీకు ఇచ్చి.. వారిని రప్పించారు. వచ్చాకా మిగిలింది రిక్తహస్తాలే! దటీజ్ చంద్రబాబు!

చంద్రబాబు నిర్ణయాల పలితం-శక్తిమంతంగా KCR 

యాత్ర సినిమా సగటు విజయం ఏం చెప్తోంది?