కాంగ్రెస్ ను అలా వాడనున్న చంద్రబాబు!

ఒకవైపు ఏపీ కాంగ్రెస్ లీడర్లు తెలుగుదేశం పార్టీతో పొత్తు కావాలంటూ ఢిల్లీకి నివేదికలు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు మీద వారి ఆశలు చాలానే ఉన్నాయి. కాంగ్రెస్ తరఫున పోటీచేస్తే సోలోగా సత్తాచాటే అవకాశాలు ఏమీ ఉండవు. అలాంటి నేపథ్యంలో... తెలుగుదేశంతో పొత్తైనా ఉంటే కొంత ప్రయోజనం ఉంటుందని ఏపీ కాంగ్రెస్ లీడర్లు ఆశించారు. ఆ మేరకు అధిష్టానానికి వారు నివేదికలు ఇచ్చుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం అందుకు రివర్స్ లో వెళ్తున్నట్టుగా తెలుస్తోంది.

ఏపీలో ఇరుపార్టీల పొత్తు వద్దు అని చంద్రబాబు నాయుడు రాహుల్ తో చెప్పాడని తెలుస్తోంది. పొత్తు వల్ల ప్రయోజనం ఉండదని తెలంగాణ ఎన్నికలతో తేలిపోయిందని రాహుల్ కు వివరించాడట బాబు. తెలంగాణలో పొత్తు పెట్టుకుని దెబ్బతిన్నాం.. ఏపీలో పొత్తులేకుండా వెళ్దామని చంద్రబాబు నాయుడు రాహుల్ కు సూచించినట్టుగా తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంతో పొత్తులేకుండా పోటీచేయడం వల్లా.. ఆ పార్టీ సొంతంగా పోటీచేస్తే.. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా చీలుతుందని.. అది తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం అవుతుందని, తెలుగుదేశం బాగుపడితే అది ఢిల్లీలో కాంగ్రెస్ కే మేలు అవుతుందని రాహుల్ కు తన ప్రయోజనాలకు అనుకూలమైన విశ్లేషణలు వినిపించాడట చంద్రబాబు నాయుడు.

బాబు చెప్పిన దానికి తలూపడం మించి రాహుల్ కూడా ఏం చేయలేని స్థితి. కాదు పొత్తు కావాలని పట్టుబడితే బాబు కూడా ఎక్కడ దూరం అవుతాడో అనే భయం రాహుల్ కు ఉండనే ఉంది. దీంతో.. బాబు చెప్పిన దానికి రాహుల్ ఒప్పుకోక తప్పడం లేదని తెలుస్తోంది.

అయితే ఏపీ కాంగ్రెస్ లీడర్లు మాత్రం.. పొత్తు కావాలని.. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడాని అధిష్టానాన్ని కోరుతున్నారని తెలుస్తోంది. అందుకే రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. 20వ తేదీ వరకూ సమయం ఉందని, అప్పటికి టీడీపీతో పొత్తు ఉంటుందా, ఉండదా అనే అంశంపై స్పష్టత వస్తుందని అంటున్నాడని తెలుస్తోంది.

అయితే కాంగ్రెస్ తో కలిసిపోటీ చేయడానికి బాబు నో చెప్పేశాడని, కాంగ్రెస్ సోలోగా పోటీచేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడమే పని అని చంద్రబాబు నాయుడు ఢిల్లీ లెవల్లో మంత్రాంగం నడిపించేశాడని సమాచారం.

పబ్లిక్ పల్స్: వినయ విధేయ రామ ఎలా ఉందంటే?

అనుభవంలేని క్రిష్‌, సాయిమాధవ్‌... ప్రకాష్‌రాజ్‌, మురళిశర్మలతో పోటీపడ్డారా?

Show comments