జయలలితగా నిత్యా.. అచ్చం ‘అమ్మ’లా!

ఇది ఫొటో షాప్ జనరేషన్. కాబట్టి కొన్ని కొన్ని నమ్మడం కష్టమే. తాజాగా బయటకు వచ్చిన జయలలిత బయోపిక్ స్టిల్ కూడా అలానే ఉంది. ప్రియదర్శిని అనే దర్శకురాలు జయలలిత బయోపిక్ ను తీస్తానని కొంతకాలం కిందట ప్రకటించింది. అందుకు సంబంధించి నేడు ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. జయలలిత రెండో వర్ధంతి సందర్భంగా ఈ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

ఇందులో నిత్యామీనన్ లుక్ స్టన్నింగ్ గా ఉంది. అక్కడ ఉన్నది నిత్యామీనన్ అంటే నమ్మడం కష్టం. అంతలా జయలలితను ప్రతిబింబించింది ఈ లుక్. దర్శకురాలు ప్రియదర్శిని అయితే స్టిల్ లో ఉన్నది నిత్యామీనన్ అని ప్రకటించింది. ముమ్ముర్తులా జయను పోలినట్టుగా నిత్యామీనన్ సెట్ అయ్యిందనే పొగడ్తలపై ఆమె హర్షం వ్యక్తంచేస్తోంది. 

అయితే జయలలిత ఓల్డ్ ఫొటోను తీసుకుని నిత్యామీనన్ ఫేస్ ను దాంతో మార్ఫింగ్ చేశారనే కామెంట్ కూడా వినిపిస్తోంది. మార్ఫింగ్ అయితే అది ఈ స్టిల్ కే పరిమితం అవుతుంది. దీనిపై కొందరు మండి పడుతున్నారు. ఒక గొప్పనేత బయోపిక్ ను తీస్తూ ఈ ఫొటో షాప్ టెక్నిక్స్ ఏమిటి.. ఒరిజినల్స్ తో రండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అది లోకేష్ కెరీర్ కు మరింత మైనస్ కాదా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments