నిర్మాత మారారు.. కథ రేంజ్ మారింది

దర్శకుడు శ్రీనువైట్ల మళ్లీ మరోసారి తన స్టామినా ఏమిటి అన్నది ప్రూవ్ చేసుకున్నారు. ఇంతకు మించి అద్భుతాలు చేయడం తనవల్ల కాదు అని చాటి చెప్పేసారు. ఇంకా ఎవరైనా నమ్మకం పెట్టుకుంటే అది వారి ఇష్టం అన్నమాట. ఆగడు.. బ్రూస్ లీ.. మిస్టర్ పరాజయాల పరంపరలో అమర్.. అక్బర్.. ఆంథోని ని చేర్చేసారు.

ఆ సంగతి అలా వుంచితే ఈ సినిమాకు సంబంధించి చిత్రమైన సంగతి ఒకటి తెలుస్తోంది. ఈ సినిమా కథను ముందుగా శ్రీనువైట్ల కాస్త తక్కువ రేంజ్ లో తయారు చేసుకున్నారట. ఫ్లాపుల్లో వున్న తనకు ఎవరు అవకాశం ఇస్తారు? ఎంత పెట్టుబడి పెడతారు? అన్న డవుట్ తో. ఇదే కథను. ఓ అద్భుతమైన బీచ్ రిసార్ట్ నేపథ్యంలో తయారుచేసుకున్నట్లు తెలుస్తోంది.

హీరో ఫ్యామిలీకి మాంచి బీచ్ రిసార్ట్ వుండడం, దాన్ని దుండగులు కాజేయడం, ఫ్యామిలీని చంపేయడం, రివెంజ్ అన్నమాట. ఈ రేంజ్ కథ అంతా ఇక్కడిక్కడే అంటే కేరళ, ముంబాయి రేంజ్ లో జరుగుతుందన్నమాట.

అప్పటి బడ్జెట్ మహా అయితే అంతా కలిపి 20 కోట్ల లోపే. ఈలోగా మైత్రీ మూవీమేకర్స్ రంగంలోక వచ్చారు. శ్రీనువైట్ల తెలివిగా వాళ్లకు ఇదే కథను, అమెరికా, ఫార్మా కంపెనీ, వేలకోట్ల రేంజ్ కు తీసుకుపోయి చెప్పారు.

దాంతో 33 కోట్ల సినిమాగా మారిపోయింది. మైత్రీ మూవీమేకర్స్ కే అదే సినిమాను, పాతికకోట్ల రేంజ్ లో (రెమ్యూనిరేషన్లతో కలిపి) తీసి వుంటే మంచి లాభాలు వచ్చి వుండేవి. కానీ ముఫై మూడుకోట్ల రేంజ్ కు మార్చడంతో, ఇప్పుడు మార్కెట్ వసూళ్ల మీద ఆధారపడాల్సి వచ్చింది.

అదృష్టం ఏమిటంటే, డబ్బింగ్, శాటిలైట్, ఇతరత్రా పాతిక కోట్లకు పైగా వచ్చేయడం. శ్రీనువైట్లకు రెమ్యూనిరేషన్ లేకపోవడం.

Show comments