నిజంగా బాబు కామధేనువే

'కామధేనువు ను వదిలేసి ఎద్దును తెచ్చుకున్నారు' అన్నది చంద్రబాబుగారి ఘాటైన కామెంట్ జనాల మీద. దీనికి నవ్వుకున్న వాళ్లు నవ్వుకున్నారు. భలే అన్నారు అనుకున్నారు తమ్ముళ్లు. మా నాయకుడు ఎద్దునా? అని ఎదురు వాయించారు జగన్ అనునాయులు. కానీ బాబుగారి మాటలను ఎవ్వరూ సరిగ్గా అర్థం చేసుకోలేదు. నిజానికి ఆయన అన్నది వాస్తవం. ముమ్మాటికీ, నూటికి నూరు పాళ్లు వాస్తవం.

చంద్రబాబు అయిదేళ్ల పాటు సాక్షాత్తూ కామధేనువు మాదిరిగానే వున్నారు. కానీ ప్రజలకు కాదు.  ఆయన కు కావాల్సిన జనాలకు. వివిధ రూపాల్లో, కాంట్రాక్టుల్లో, కన్సెల్టన్సీల్లో, భూముల కేటాయింపులో, ఇంకా అనేకానేక వీలయిన రూపాల్లో సాయాలు చేయడంలో ఆయన కామధేనువుగానే వ్యవహారించారు. ఆయన అనుకూల మీడియాలకు కోట్లకు కోట్లు ప్రకటనలు కట్టబెట్టారు. ఆయనను నమ్ముకున్నవారికి, ఆయనకు అయిన వారికి ఆయన కామధేనువుగానే వ్యవహరించారు. 

ముఖ్యంగా కృష్ణ, గుంటూరు జిల్లాల మీద ఆయన అవాజ్యమైన ప్రేమానురాగాలు చూపించారు. ఆయా జిల్లాల్లో ఆయన జనాలకు ఆయన చాలా అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఆ జిల్లాల్లో కూడా ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేసారు. అదిగో అందుకు అన్నారు చంద్రబాబు. 'మీరు ఈ కామధేనువును కాదనుకుని, ఎద్దును తెచ్చుకున్నారు' అని.

ఎవరైతే ఆయన వల్ల పనులు చేయించుకుని, ఆయన నిర్ణయాల వల్ల లబ్దిపొందారో, ముఖ్యంగా రాజధానిని, అనేకానేక సంస్థలను కృష్ణా గుంటూరు జిల్లాలకు తరలించడం వల్ల లాభపడ్డారో వాళ్లు కూడా బాబును ఓడించడాన్ని బట్టి, బాబుగారు ఆ మాట అన్నారు. 

అందువల్ల బాబుగారు అన్నది ముమ్మాటికీ సత్యమే.

Advertising
Advertising