కాస్టింగ్ కౌచ్ వలలో మరో పెద్దచేప

బాలీవుడ్ తో పాటు టోటల్ ఇండియాను కుదిపేస్తున్న మీ-టూ ఉద్యమం ఇప్పుడు మరో నటుడ్ని తాకింది. అతడి పేరు నవాజుద్దీన్ సిద్ధిఖి. తన విలక్షణ నటనతో బాలీవుడ్ లో సెపరేట్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ నటుడు ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. ఇతడిపై ఆరోపణలు చేసిన ఆ హీరోయిన్ పేరు నిహారిక సింగ్.

2005లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ గా ఎంపికై బాలీవుడ్ ను ఆకర్షించింది నిహారిక సింగ్. అయితే ఆమె పెద్దగా క్లిక్ అవ్వలేకపోయింది. అదే టైమ్ లో నవజుద్దీన్ సిద్ధిఖి ఆమెకు దగ్గరయ్యాడు. ఒకానొక టైమ్ లో వీళ్లిద్దరి మధ్య ఎఫైర్ ఉందంటూ పుకార్లు కూడా వచ్చాయి. అప్పటి ఉదంతాలపై ఎట్టకేలకు స్పందించింది నిహారిక సింగ్. నవాజుద్దీన్ తనను వేధించాడంటూ మీడియాకెక్కింది.

"2009లో మిస్ లవ్లీ అనే సినిమాకు సైన్ చేశాను. అప్పుడే నవాజుద్దీన్ పరిచయం అయ్యాడు. ఆ టైమ్ లో నవాజ్ నాకు బాగా దగ్గరయ్యాడు. నాతో పరిచయం పెంచుకున్నాడు. స్టార్టింగ్ లో నేను కూడా అతడ్ని నమ్మాను. ఒకరోజు నన్ను లంచ్ కు పిలిచాడు. సహకరించమని ప్రాధేయపడ్డాడు. నేను వినలేదు. అతడ్ని తోసేశాను."

ఇలా తనకు జరిగిన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టింది నిహారిక. అయితే నవాజ్ అక్కడితో ఆగలేదని, ఆ తర్వాత కూడా మరోసారి అలాంటి ప్రయత్నం చేశాడని వివరించింది.

"ఒక రోజు పొద్దున్నే నవాజ్ నాకు మెసేజ్ పెట్టాడు. ఇంటి కిందే ఉన్నానన్నాడు. నేను ఇంట్లోకి ఆహ్వానించాను. నేను ఇలా తలుపు తెరిచిన వెంటనే నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. అతడ్ని వెనక్కి తోయడానికి ప్రయత్నించాను. కానీ కుదర్లేదు. ఆ టైమ్ లో అతడికి లొంగిపోయాను. మా మధ్య సంబంధం అప్పుడే మొదలైందని కచ్చితంగా చెప్పలేను."

ఇలా నవాజ్ తో తనకున్న బంధాన్ని బయటపెట్టింది నిహారిక. అయితే ఎప్పుడైతే తను పడిపోయానో అప్పట్నుంచి నవాజ్ తన అసలు రంగు బయటపెట్టాడంటోంది నిహారిక. తన చెల్లెలు, తల్లికి పరిచయం చేస్తానంటే వద్దని వారించాడని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అతడి అక్రమ సంబంధాలు, వరకట్న వేధింపుల కేసు వివరాలు కూడా తనకు తెలిశాయని, అప్పట్నుంచి నవాజ్ కు దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చింది.

"కేన్స్ ఫిలింఫెస్టివల్ మమ్మల్ని కలిపింది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత అక్కడ కలిశాం. తను సారీ చెప్పాడు. దాదాపుగా మళ్లీ కలిశాం. అయితే ఆ తర్వాత ఓ సినిమాలో చిన్న రోల్ ఇచ్చి సెక్సువల్ ఫేవర్ చేయమని అడిగాడు. ఇక అప్పట్నుంచి అతడ్ని కట్ చేశాను."

నవాజ్ తో తను ఎఫైర్ సాగించాననే విషయాన్ని నిహారిక ఖండించింది. 2-3 సార్లు శారీరకంగా కలిసినమాట వాస్తవమేనని, ఆ మాత్రం దానికే తమ మధ్య ఎఫైర్ ఉన్నట్టు నవాజ్ చెప్పడం సభ్త కాదని అంటోంది నిహారిక. సెక్స్ కోసం నవాజ్ తనను ఎన్నోసార్లు వేధించాడని ఆరోపిస్తోంది.

ప్రస్తుతం బాలీవుడ్ లో నానా పటేకర్, సాజిద్ ఖాన్, అనుమాలిక్ లాంటి ప్రముఖులు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి నవాజుద్దీన్ కూడా చేరాడు. నిహారిక ఆరోపణల్ని ఇతడు ఎలా తిప్పికొడతాడో చూడాలి.

ఆ టికెట్ల విషయంలో కుటుంబ పోరు!... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్  

Show comments