బాలయ్య గెటప్ మార్చకుండానే

జగన్ ను ఆయన తాత రాజారెడ్డిని ఇద్దరనీ విలన్లుగా చూపిస్తూ, కేఎస్ రవికుమార్ రాసుకున్న కథ మూలన పడిపోయింది. తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓటమిపాలు కావడంతో ఈ కథను మూలన పడేసారు. దాంతో పరుచూరి మురళి దగ్గర వున్న కథ తీసుకుని, అదే కేఎస్ రామారావుతో సి కళ్యాణ్ కొత్త సినిమాకు ఈరోజు శ్రీకారం చుట్టారు.

అయితే ముందు అనుకున్న కథ కోసం బాలయ్య బాగా గెడ్డంపెంచారు. కానీ ఇప్పుడు తీస్తున్న కథ వేరు. ఇందులోనూ బాలయ్య పోలీస్ ఆఫీసర్ నే. కానీ గెడ్డం గెటప్ వుంటుందా? వుండదా? అన్నది సందేహం. బాలయ్య గెడ్డం తీయకుండానే ఓపెనింగ్ కు హాజరయ్యారు. అయితే ఇది కేవలం పూజ మాత్రమే, సినిమా షూటింగ్ కొన్నిరోజుల తరువాత నుంచి. అందువల్ల అప్పుడు కానీ బాలయ్య గెటప్ విత్ గెడ్డం ఆర్ వితవుట్ గెడ్డం అన్నది తెలియదు.

ఈ సినిమా అయిపోయాక, బాలయ్య ట్రయినర్ ను పెట్టుకుని కనీసం పదికిలోలు తగ్గే ఆలోచనలో వున్నారు. బోయపాటి తన సినిమాకు పూర్తి మేకోవర్ అవసరం అని చెప్పడంతో బాలయ్య ఓకె అన్నారు. ఈ సినిమాకు ఇదే లావు, ఇదే గెడ్డంతో లాగించేసి, బోయపాటి సినిమాకు కొత్తగా కనిపిస్తారన్నమాట.

బాలయ్య కొత్త సినిమా ఓపెనింగ్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి

గాజువాకలో అయితే బొత్తిగా తృతీయస్థానం