దోపిడీని అడ్డుకుంటే కూడా ఏడుస్తారా?

ఒకచోట దోపిడీ జరుగుతోంది. కొంతకాలం పాటూ దానికి అపరిమితమైన ప్రోత్సాహం లభిస్తూ వచ్చింది. ఇప్పుడు దానిని అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. అందుకు కూడా ఏడిస్తే ఎలా? దోపిడీకి బలవుతున్న వాళ్లు ఎంతకాలమైనా ఎదురుచూసే ధోరణితోనే ఉన్నారు గానీ... దోపిడీ వలన లబ్ధిపొందుతూ వచ్చిన వారికి ఇలాంటి ప్రయత్నాలు కంటగింపుగా మారుతున్నాయి. వారి ఏడుపు సరే... దోపిడీని అడ్డుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలను చూసి మీడియా కూడా విలపిస్తే ఎలాగ? అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక దోపిడీ అయిదేళ్లపాటు విచ్చలవిడిగా సాగిపోయింది. ఇసుక తీరువాలను విక్రయించి, వాటికి వేలంపాటలు నిర్వహిస్తే... విపక్షాలు కూడా కొన్నిచోట్ల దక్కించుకుంటున్నాయని  మధనపడిపోయారో ఏమిటో గానీ... తీరువా వేలం పాటలను ఆపేశారు. ఇసుక ఫ్రీ అని ప్రకటించారు. చంద్రబాబు ఫ్రీ అని ప్రకటించిన ముహూర్తం ఏంటో గానీ... ఏకపక్షంగా పచ్చ దోపిడీ కంటిన్యూ అయింది. పాటలు ఉన్నప్పటికి సమానమైన ధరల్లోనే కేవలం అధికార పార్టీ వారు మాత్రం దోచుకోవడం షురూ అయింది. చిన్నస్థాయి నుంచి ఎమ్మెల్యేల వరకు ఇసుకఉన్న ప్రతిచోటా కోట్లకు పడగలెత్తారు.

జగన్మోహన రెడ్డి అధికారంలోకి రాగానే... ఈ అనధికారిక దోపిడీకి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇసుక తవ్వకాలను ఆపించారు. జులై 1లోగా కొత్త ఇసుక విధానం తీసుకువస్తాం అని.. ఇసుక అమ్మకాల ద్వారా నేరుగా ప్రభుత్వానికే లబ్ధిచేకూరేలా చేస్తామని ప్రకటించారు. వ్యక్తులుగా దోచుకోవడాన్ని అడ్డుకోబోతున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని స్వాగతించడం బదులు పచ్చమీడియా గొంతు చించుకుంటున్నది. రెండు మూడు వారాల పాటూ ఇసుక సరఫరా బంద్, నిలిచిపోనున్న నిర్మాణాలు... అంటూ అక్కడికేదో బ్రహ్మాండం బద్ధలైపోతున్నట్లుగా ఆవేదన చెందుతూ కథనాలు వండి వారుస్తున్నారు.

ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో లోపం ఉంటే గానీ, అవినీతికి ఆస్కారం ఉంటే గానీ... దానిని ఎత్తిచూపుతూ మీడియా కథనాలు అందిస్తే అభినందించాల్సిందే. కానీ, రంధ్రాన్వేషణే పనిగా.. మంచి నిర్ణయాలను కూడా దుష్టపోకడలుగా చిత్రించే ప్రయత్నం చేస్తే వారినేం అనాలి!

సవాల్ చేశారుగా.. సీమ పౌరుషాన్ని చూపుతారా?