వినుకొండ మెజారిటీపై జిల్లా వ్యాప్తంగా చర్చ!

గుంటూరు జిల్లాలో టీడీపీ కంచుకోట అయినటువంటి వినుకొండ నియెజకవర్గం మీదే ఇపుడు జిల్లా వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు.

మొన్నటివరకు జిల్లాలో ఎవరిని అడిగినా కానీ వినుకొండ అంటే టీడీపీ అన్నారు, ఇక్కడ సర్వేలు కూడా అవసరంలేదు టీడీపీ నే అని జిల్లాలోని వైసీపీ, ఇతర పార్టీ నాయకులు, జిల్లా ప్రజలు అనేవారు.

ఇక్కడ కమ్మ సామజిక ఓట్లు 50వేల వరకు ఉండటంతో ఈ నియోజకవర్గాన్ని గుంటూరు జిల్లా కుప్పం అనేవారు. మొన్న ఎగ్జిట్ పోల్స్ లో కూడా వైసిపికి అనుకూలంగా ఇచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ తెలుగుదేశమే అని చెప్పారు.

ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే గా ఉన్న జి.వి ఆంజనేయులు జిల్లా అధ్యక్షులు. జిల్లాలోనే బలమైన నేత. 2009,2014 లో సుమారు 25వేల ఓట్లతో టీడీపీ విజయం సాధించింది. కానీ ఈ సారి 29వేల మెజారిటీతో గత రికార్డులను, టీడీపీ ఇమేజ్ ని బద్దలు కొట్టింది. అంటే దాదాపు 50 వేల ఓట్లు మారినట్లు. ఇది ఎలా సాధ్యమైయింది అనేది ఎవరికీ అర్ధంకావటంలేదు.

ఈ గెలుపుని జీర్ణించుకోలేని నియోజకవర్గంలోని చాలా మంది టీడీపీ అభిమానులు గత రెండు రోజులుగా ఇళ్లలో నుండి బయటకురావటంలేదు. జి.వి ఆంజనేయులు కూడా బాధను మరచిపోవటానికి దాదాపు మందులోనే ఉంటున్నారని, ఇంట్లో గ్లాసులు పగలుకొడుతున్నారు అని వాళ్ళ వల్లే చెబుతున్నారు.

ఇంత మెజారిటీ రావటం అనేది, జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఉన్న క్రేజ్ తో పాటు, ఇప్పుడు ఎమ్మెల్యేగా  గెలిచిన బొల్లా బ్రహ్మనాయుడు గారి అబ్బాయి బొల్లా గిరిబాబు వ్యూహాలవల్లే ఇది సాధ్యం అయ్యింది అని మండల నాయకులు చెబుతున్నారు.  

బొల్లా గిరిబాబు మంచి వ్యూహకర్త. వల్లభ డైరీ స్థాపించిన ఒక సంవత్సరంలోనే 800కోట్ల టర్నోవర్ కి తీసుకెళ్లిన అడ్మినిస్ట్రేటర్. పైకి నెమ్మదస్తుడుగా, ఆర్భాటాలు లేకుండా, ఓపికగా ఎదుటివారుచెప్పేది వినటం, ఆచి తూచి మాట్లాడటం, పరిణితిచెందిన వాడిగా వ్యవహరించటం, అందరిలో కలసిపోవటం వల్ల చాలా మంది పార్టీ కార్యకర్తలు గిరిబాబుని అభిమానించేవాళ్ళు.

ఢిల్లీ లో రాజకీయ పాఠాలు చెప్పే ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకొని, పోల్ మానేజ్మెంట్ లో అనేక పుస్తకాలు చదివి, కొంత మంది మాజీ ఎమ్మెల్యేలతో ఎన్నికల వ్యూహాలమీద చర్చించి అనుభవం తెచ్చుకున్నారు.

ఎన్నికలకు ఆరు నెలల ముందు బొల్లాపల్లి మండల ఇంచార్జి గా బాధ్యతలు స్వీకరించి అక్కడ పార్టీని బాగా పటిష్టం చేసారు. ఆ తరువాత అన్ని మండల మీద ఫోకస్ చేసి తనదైన వ్యూహాలతో ప్రత్యర్థిని బలంగా దెబ్బకొట్టారు. సొంత సామజిక వర్గంలోని యువత అంతా గిరిబాబుకి జై కొట్టారు.

హైదరాబాద్, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటున్న కరుడుకట్టిన టీడీపీ అభిమానులను కూడా తనవైపు తిప్పుకోగలిగారు. ఇక్కడ జరిగిన పోల్ మానేజ్మెంట్ బహుశా రాష్టంలోనే ఎక్కడా జరిగిఉండదు.

ప్రముఖ సర్వే కంపెనీలు కూడా వాళ్ళ సర్వేలు తప్పేసరికి ఇప్పుడు వినుకొండకి వచ్చి ఇక్కడ ఎలెక్షనీరింగ్ జరిగినదానిమీద ఆరా తీస్తున్నారు. ఆఖరికి జీవీ సొంత గ్రామంలో కూడా వైసిపికి మెజారిటీ రావటంతో తెలుగు తమ్ముళ్లు పూర్తిగా ఢీలా పడిపోయారు. జిల్లా అధ్యక్షుడిని మట్టి కరిపించి మొత్తం మీద బొల్లా గిరిబాబు జిల్లా వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు.

బొల్లా గిరిబాబు ది  ఆర్ధికంగా బలమైన కుటుంబం మరియు మంచి వ్యూహకర్త, బలమైన నాయకత్వ లక్షణాలు కలిగిఉండటంతో గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి సరైన వ్యక్తి అని నియోజకవర్గ నాయకులు, జిల్లా లోని కొంత మంది నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఏది ఏమైనా వినుకొండ మెజారిటీ ని జీర్ణించుకోటానికి తెలుగు తమ్ముళ్లకు చాలా రోజులు పడుతుంది.