బన్నీ-త్రివిక్రమ్-30రోజులు

బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో హారిక హాసిని, గీతా కలిసి నిర్మించే సినిమా షూట్ ప్రారంభమై, రెండు ఫైట్లు తీసి గ్యాప్ ఇచ్చారు. స్క్రిప్ట్ ఫినిషింగ్ లో త్రివిక్రమ్ బిజీగా వుండడంతో గ్యాప్ తప్పలేదు. దాంతో ఈ సినిమాకు ఏదో అయిపోయిందనేంతగా గ్యాసిప్ లు వచ్చేసాయి. వీటికి తెరదించుతూ ఈనెల 29 నుంచి ఓ లెంగ్తీ షెడ్యూలుకు శ్రీకారం చుడుతున్నారు.

ఏకంగా దాదాపు 30 రోజుల షెడ్యూలును కేవలం హైదరాబాద్ పరిసరాల్లోనే ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 29న ప్రారంభించి వచ్చేనెల 26 దాటే వరకు సింగిల్ షెడ్యూలు లో దాదాపు ఇరవై నుంచి ముఫైశాతం సినిమాను ఫినిష్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఈ లెంగ్తీ షెడ్యూలులో దాదాపు కీలక నటులంతా పాల్గొంటారు. హైదరాబాద్ లో లోకేషన్ల రెక్కీ ఫినిష్ చేసారు. బన్నీ కూడా నాన్ స్టాప్ గా సినిమా షూట్ చకచకా చేసే ఆలోచనలో వున్నాడు. అందుకే ఇంత లెంగ్తీ షెడ్యూలు వేసినట్లు తెలుస్తోంది.