వైఎస్సార్ఎల్సీ నేతగా వైఎస్ జగన్.. కొత్త రికార్డులు!

వైఎస్సార్ కాంగ్రెస్ లెజిస్ట్లేటివ్ పార్టీ అధ్యక్షుడుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యి జగన్ ను తమ లెజిస్ట్లేటివ్ విభాగం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆద్యంతం ఆనందోత్సాహాల మధ్యన ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీ అధినేతను ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తూ సంతకాలు చేశారు.

ఏపీలో అధికారాన్ని చేపడుతున్న రెండో ప్రాంతీయ పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రికార్డు పుటల్లోకి ఎక్కింది. ఇంత వరకూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అధికారం  కాంగ్రెస్ చేతిలో లేదంటే తెలుగుదేశం పార్టీ చేతిలో ఉంటూ వచ్చింది. మరో ప్రాంతీయ పార్టీ కానీ, జాతీయ పార్టీ కానీ ఇక్కడ అధికారాన్ని సొంతం చేసుకోలేదు. 

ఇలాంటి నేపథ్యంలో ఏపీలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న రెండో ప్రాంతీయ పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రికార్డు సృష్టించింది.  అలాగే తను ఒక పార్టీని స్థాపించి అధికారాన్ని సొంతం చేసుకున్న నేతగా ఎన్టీఆర్ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలుస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిగా ఎన్టీఆర్ అధికారాన్ని సొంతం చేసుకున్నారు. ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడిగా జగన్ మోహన్ రెడ్డి అధికారాన్ని సొంతం చేసుకుని, ముఖ్యమంత్రి అవుతున్నారు.

జగన్ ఫోటోస్ కోసం క్లిక్ చేయండి