జగన్ ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే

ఈ ఐదేళ్లలో రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చేశారు చంద్రబాబు. చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు ఏమీలేవు కానీ.. లెక్కలేనన్ని అప్పులు మాత్రం చేశారు. వాటిని అనవసర, దుబారా ఖర్చులకు, అర్భాటాలు, ప్రచారాలకు వాడేశారు. చివరికి పొరుగు రాష్ట్రాల్లో కాఫీలు తాగడానికి, టిఫిన్లు చేయడానికి ఖరీదైన విమాన ప్రయాణాలు చేశారు. ఇలా విభజన టైమ్ లో 85వేల కోట్ల రూపాయలుగా ఉన్న అప్పుల్ని, ఈ ఐదేళ్లలో ఏకంగా 3లక్షల 5వేల కోట్ల రూపాయలకు చేర్చారు. ఎంతో అభివృద్ధి చేశామంటూ పైకి ప్రచారం చేసుకునే చంద్రబాబు, తెరవెనక మాత్రం 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు మిగిల్చారు. ఇలాంటి అవ్యవస్థలన్నింటినీ జగన్ ఇప్పుడు గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది.

జగన్ వస్తే ఎన్నో చేస్తారని అఖిలాంధ్ర ప్రజానీకం ఆశగా ఎదురుచూస్తోంది. అంతే ఆశ జగన్ లో కూడా ఉంది. నవరత్నాల్ని అమలు చేసి, పేద ప్రజలకు ఎఁతో చేయాలని పరితపిస్తున్నారాయన. మరీ ముఖ్యంగా ఒకప్పటి రాజన్న రాజ్యాన్ని ఆవిష్కరించాలనేది జగన్ కల. కానీ ఆ కలకు ప్రధాన అడ్డంకిగా మారింది రాష్ట్ర రుణం. చంద్రబాబు చేసిన ఈ అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే, కొత్త సంక్షేమ పథకాల్ని ముందుకు తీసుకెళ్లాలి. ఇదే జగన్ ముందున్న అతిపెద్ద సవాల్.

కొత్తగా ఏ పథకం ప్రవేశపెట్టాలన్నా అదనంగా నిధులు కావాల్సిందే. ఎలాంటి ప్రాజెక్టుకు ఓకే చెప్పాలన్నా దానికి బడ్జెట్ కేటాయించాల్సిందే. అందుకే ఈ దిశగా కార్యాచరణ సిద్ధంచేసి పెట్టుకున్నారు జగన్. ఇప్పటికే అమల్లో ఉండి పెద్దగా సక్సెస్ కాని కొన్ని పథకాల్ని పక్కనపెట్టాలని నిర్ణయించారు. వీటితో పాటు రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పిస్తూ, ప్రజలపై భారం పడకుండా అదనపు ఆదాయాన్ని ఆర్జించే మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, అధికారులతో సమావేశంలో జగన్ మాట్లాడబోయే మొదటి టాపిక్ ఇదే.

ఇవన్నీ ఒకెత్తయితే.. మరికొన్ని ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలు తీసుకుబోయే అప్పులు కూడా రాష్ట్ర ప్రభుత్వ మెడకు చుట్టుకోబోతున్నాయి. కొన్ని ప్రభుత్వ సంస్థలు చేయబోయే లక్ష కోట్ల రూపాయల అప్పులకు ప్రభుత్వం ష్యూరిటీగా ఉంది. ఈ మేరకు ఇది కూడా అదనపు భారం కాబోతోంది. దీంతోపాటు కార్పొరేషన్ల అవసరాలు తీర్చడానికి ఉపయోగపడే పీడీ ఎకౌంట్లు కూడా పెనుభారంగా మారాయి. ఎందుకంటే ఈ ఎకౌంట్లలో డబ్బులు లేకుండా చేశారు చంద్రబాబు. ఈ డబ్బుల్ని కూడా వాడేశారు. మరోవైపు పెండింగ్ బిల్లుల కింద మరో 50 కోట్ల రూపాయల మొత్తాన్ని చెల్లింపుల కోసం సిద్ధంగా ఉంచారు. ఇవన్నీ ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి సవాల్ గా మారాయి.

చేసిన అప్పులతో పాటు దుబారా కూడా ఎక్కువే. దేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ ధనాన్ని దుబారా చేసిన రాష్ట్రంగా అప్రతిష్ట మూటగట్టుకుంది ఆంధ్రప్రదేశ్. దీనికి ప్రధాన కారణం చంద్రబాబు వైఖరి. నవనిర్మాణ దీక్షలు, ధర్మపోరాట దీక్షలతో పాటు, తన పర్యటనల కోసం కోట్లలో డబ్బు దుబారా చేశారు చంద్రబాబు. ఇవి కూడా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశాయి. వీటన్నింటినీ సరిచేయడమే జగన్ ముందున్న తక్షణ కర్తవ్యం.

సినిమా రివ్యూ: సీత