రవిప్రకాష్ కు ఇంకో ఎదురుదెబ్బ? వాట్ నెక్ట్స్?

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ మరో రోజు పోలీసు విచారణకు మొహం చాటేశారు. బుధవారం రోజున ఆయన విచారణకు హాజరుకాకపోతే అరెస్టు వారెంట్ తప్పదనే మాట వినిపించింది. అయినా రవి ప్రకాష్ మాత్రం పోలీసుల ముందుకు హాజరుకాలేదు. 

ఇక తనపై కేసులు పెట్టడమే తప్పంటూ రవి ప్రకాష్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ కూడా తిరస్కరణకు గురి అయ్యింది. తన పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలంటూ రవి ప్రకాష్ కోరగా, దానికి న్యాయస్థానం నో చెప్పింది. ఆ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదంటూ కొట్టివేసింది.

దీంతో విచారణ కూడా లేకుండానే కేసులను కొట్టేయాలన్న రవి ప్రకాష్ వాదనకు విలువ లేకుండా పోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో రవి ప్రకాష్ తనే వచ్చి లొంగిపోవడమా, లేక పోలీసులు అతడిని పట్టుకుని అరెస్టు చేయడమా.. అనేదే మిగిలింది.

జర్నలిస్టుగా బోలెడన్ని నీతులు చెప్పి.. ఇలా పరారీలో ఉండటానికి రవి ప్రకాష్ కు ఏమీ అనిపించడం లేదా! ఆయన చెప్పిన నీతుల చిట్టాకూ ఇలా పరారీలో ఉన్న నిందితుడి ట్యాగ్ కు ఏమాత్రం పొంతన లేకుండా పోయింది. మరి రవి ప్రకాష్ వ్యవహారంలో నెక్ట్స్ ఏం జరుగుతుందో!

ఓడిపోతే రెడ్డిగారికి రాజకీయ రిటైర్మెంటేనా!