బీజేపీ ఖాతా తెరవనుందా? హీరో గెలుపు ఖాయమా!

కేరళలో భారతీయ జనతా పార్టీ ఈసారి ఖాతా తెరవడం ఖాయమని అంటున్నాయి మీడియా వర్గాలు. అటు ఎల్డీఎఫ్, ఇటు యూడీఎఫ్ల మధ్య విజయం దోబూచులాడే కేరళలో భారతీయ జనతా పార్టీ ఒక ఎంపీ సీటును సాధించే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి.

బీజేపీ తరఫున త్రిశూర్ నుంచి ఎంపీగా పోటీచేసిన నటుడు సురేష్ గోపి విజయం సాధించే అవకాశం ఉందని మీడియా వర్గాలు అంటున్నాయి. యూడీఎఫ్  అభ్యర్థి ప్రతాపన్ ఓటమిని దాదాపుగా ఒప్పేసుకుంటున్నారని మీడియా వర్గాలు వ్యాఖ్యానిస్తూ ఉండటం విశేషం.

కేరళలో బీజేపీ ఖాతా తెరిచిందంటే ఆ పార్టీకి అది గొప్ప విజయమే అవుతుంది. ఆ  రాష్ట్రంపై బీజేపీ చాలాకాలంగా ఒక కన్నేసి ఉంచింది. సురేష్ గోపిని చేర్చుకుని, అతడికి రాజ్యసభ సీటును కూడా ఇచ్చింది కమలం పార్టీ. అయ్యప్ప దేవాలయంలోకి స్త్రీల ప్రవేశం వ్యవహారాన్ని బీజేపీ రాజకీయంగా బాగా ఉపయోగించుకుంది.

అటు కాంగ్రెస్ వాళ్లు ఈ అంశంలో ఘాటుగా స్పందించలేకపోయారు. అధికార ఎల్డీఎఫ్ కోర్టు తీర్పును అమలు చేసింది. ఈ వ్యవహారంలో సంప్రదాయ వాదులకు అనుకూలంగా వ్యవహరించింది భారతీయ జనతా పార్టీ. సురేష్ గోపి కూడా ఎన్నికల ప్రచారంలో 'శరణం అయ్యప్ప' అంటూ వ్యాఖ్యానించారు.

అదో పెద్దదుమారం అయ్యింది. ఏతావాతా ట్రెడిషనల్ హిందువుల ఓట్లు బీజేపీ అభ్యర్థి అయిన సురేష్ గోపికి గంపగుత్తగా పడ్డాయని ఆయన విజయం సాధించడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. అయితే కాంగ్రెస్ వాళ్లు మాత్రం తాము భారీ మెజారిటీని సాధించే నియోజకవర్గాల్లో త్రిశూర్ కూడా ఒకటి అవుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

ఓడిపోతే రెడ్డిగారికి రాజకీయ రిటైర్మెంటేనా!