తెలుగులోకి ఆ హీరో

జెర్సీ సినిమా చూసిన వారందరికీ గుర్తుంటాడు నాని కథను చెప్పిన కొడుకు క్యారెక్టర్ వేసిన నటుడు హరీష్ కళ్యాణ్. ఈ యంగ్ హీరో తమిళంలో ఇప్పటికే కొన్ని సినిమాలు చేసాడు. జెర్సీతో తెలుగు జనాలకు పరిచయం అయిన ఈ హరీష్ కళ్యాణ్ త్వరలో పూర్తిగా తెలుగులో కనిపించబోతున్నాడు.

ఇటీవల అతగాడు తమిళంలో చేసిన ఇస్పాడే రాజువమ్, ఇదయ రాణివమ్ సినిమాను తెలుగులోకి హరిపిక్చర్స్ సంస్థ డబ్ చేస్తోంది. పక్కా మన ఆర్ ఎక్స్ 100 టైపు సినిమా ఇది. హీరోయిన్ క్యారెక్టర్ అయితే ఆర్ ఎక్స్ 100 హీరోయిన్ క్యారెక్టర్ కు కాస్త ఎక్కువే. ఈ సినిమాను 'రౌడీ బేబీ' పేరుతో తెలుగులోకి తెస్తున్నారు. జూన్ లో విడుదల.

ఇదిలావుంటే ఇదే హీరోతో ఓ స్ట్రయిట్ సినిమాకు కూడా ప్రయత్నాలు షురూ అయ్యాయి. ఒక పెద్ద సంస్థ, కొత్త డైరక్టర్ తో చేయబోయే సినిమాలో హరీష్ కళ్యాణ్ నే హీరో. తెలుగు మూలాలున్న ఈ తమిళ హీరో తెలుగులో కూడా క్లిక్ కావాలని చూస్తున్నాడు. ఒడ్డు, పొడవు, అందం చందం బాగానే వున్నాడని జెర్సీతో ప్రూవ్ చేసుకున్నాడు. హీరో మెటీరియల్ వుందని ఇప్పుడు రాబోయే సినిమాలతో ప్రూవ్ చేసుకోవాలి.

ఓడిపోతే రెడ్డిగారికి రాజకీయ రిటైర్మెంటేనా!