రామోజీతో మీటింగ్ కు చంద్రబాబు!

తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 'ఈనాడు' అధిపతి రామోజీరావుతో భేటీ అవుతున్నారని తెలుస్తోంది. మరి కాసేపట్లో ఈ సమావేశం జరగనుందని సమాచారం. ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చేందుకు మరెంతో సమయం లేని నేపథ్యంలో రామోజీరావుతో చంద్రబాబు నాయుడు సమావేశం అవుతుండటం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.

రామోజీ ఫిల్మ్ సిటీలో చంద్రబాబు నాయుడి హెలీకాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు ఏర్పాట్లు అయితే జరిగాయని తెలుస్తోంది. ఇంతకీ ఈ మీటింగ్ వెనుక రీజనేమిటి అనేది అధికారికంగా ఎవరికీ తెలియదు. అనధికారికంగా మాత్రం బోలెడన్ని ప్రచారాలు సాగుతూ ఉన్నాయి.

ఎన్నికల్లో ఓటమి భయం పొంచి ఉండటంతో చంద్రబాబు నాయుడు ఏం చేయాలో పాలుపోక తన రాజగురువు సలహాలు తీసుకునేందుకు వెళ్తున్నట్టుగా ఉన్నారనే కామెంట్లు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి. ఫలితాల వెల్లడికి సమయం ఆసన్నమవుతున్న తరుణంలో చంద్రబాబు నాయుడు వెళ్లి రామోజీరావును కలవడం పట్ల మరి కొందరు అనేక అనుమానాలనూ కూడా వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు నాయుడు ఏదో కొత్త ప్లాన్ ను అమలుపరిచే ప్రయత్నంలో ఉన్నట్టున్నారని వారు  అనుమానిస్తూ ఉన్నారు! ఇంతకీ లోగుట్టు ఏమిటో!

ఓడిపోతే రెడ్డిగారికి రాజకీయ రిటైర్మెంటేనా!