నీయమ్మ.. ఇస్మార్ట్ శంకర్ టీజర్

ఇలా హెడ్డింగ్ పెట్టడం జర్నలిస్టిక్ వాల్యూస్ కు విరుద్దంయేమో? కానీ సినిమాల్లో ఇంగ్లీష్ బూతులు విరివిగా వాడేస్తుంటే ఎంజాయ్ చేసేస్తున్నారు. నీయమ్మ అన్నది సినిమాల్లో ఊతపదం అయిపోయింది. ఇక జర్నలిజంలో మాత్రం మడికట్టుకు కూర్చోవాలా? ఏంటీ?

రామ్-పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తయారవుతున్న ఇస్మార్ట్ శంకర్ సినిమా టీజర్ బయటకు వచ్చింది. అందరు హీరోలకు మాస్ మేకప్ వేసిన పూరి జగన్నాధ్ ఈసారి రామ్ ను మాస్ హీరోగా చూపించే బాధ్యత టేకప్ చేసారు. సినిమా సినిమాకు మాస్ అవతారాల విషయంలో కొత్త పుంతలు తొక్కుతున్న పూరి ఈ సినిమా రామ్ ను మరింత రఫ్ గా, మరింత మాస్ గా చూపించే ప్రయత్నం చేసాడు.

అసలు సిసలు హైదరాబాదీగా రామ్ ను ప్రొజెక్ట్ చేయడం వరకు ఒకె. కానీ మరీ 'నీయ్మ' అనే డైలాగుతో టీజర్ స్టార్ట్ చేయడం ఏమిటో? ఆ పదం వాడితే తప్ప మాస్ అని జనాలు అనుకోరేమో? లేదా ఆ పదం వాడితే తప్ప మాస్ కాదేమో?

ఆ సంగతి పక్కన పెడితే హైదరాబాద్ ట్రాఫిక్ అంత గడబిడ టీజర్ లో వుంది. హీరో క్యారెక్టరైజేషన్ కనిపిస్తోంది. ప్రస్తుతానికి టీజర్ కాబట్టి ఓకె. ట్రయిలర్ రావాలి. దానికి ఇంకా మరో నెల పైనే టైమ్ వుంది.