కల్కి థియేటర్ రైట్స్ @ 12 కోట్లు

హీరో రాజశేఖర్ చేస్తున్న లేటెస్ట్ సినిమా కల్కి. ఈ సినిమా టీజర్ ఇటీవల విడదలయింది. దాంతో సినిమా మీద కాస్త ఆసక్తి పెరిగింది. దీంతో ఈ సినిమా వరల్డ్  వైడ్ థియేటర్ రైట్స్ కు మాంచి బేరాలు వచ్చేసాయి.

12 కోట్లకు దాదాపు బేరం ఫైనల్ అయిపోయింది. నిర్మాత రాధా మోహన్ ఈ సినిమాను కొనుగోలు చేసినట్లు తెలిసింది. 

ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే, ఈ సినిమా మీద తమిళ క్రేజీ హీరో ధనుష్ కూడా ఆసక్తిగా వుండడం. ఆయన  ఈ సినిమాతో తెలుగు మార్కెట్ లోకి అడుగుపెట్టాలని చూస్తున్నారు.

ఆయన తన వండర్ బార్ సంస్థను టాలీవుడ్ లో కూడా విస్తరించాలనుకుంటారు. అందుకే ఆయన కూడా ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఆయన తన వండర్ బార్ సంస్థ కోసం ఈ సినిమా ఇండియా వైడ్ థియేటర్ రైట్స్ కావాలని అడుగుతున్నట్లు బోగట్టా. అయితే ఇప్పటికే రాధామోహన్ కు అగ్రిమెంట్ అయిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వరల్డ్ వైడ్ గా పన్నెండు కోట్లు అంటే తెలుగు రాష్ట్రాల్లో పది కోట్ల బిజినెస్ చేయాల్సి వుంటుంది.

Show comments