ఏపీలో రెండ్రోజుల్లో మరింత కుటిల రాజకీయం?

వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో మొదలైన కుటిల రాజకీయం.. మరో రెండు మూడురోజుల్లో పతాకస్థాయికి చేరనుందా? ఈ రెండ్రోజుల్లో అత్యంత కీలకమైన పరిణామాలు సంభవించనున్నాయా? కడప ఎంపీ సీటును లక్ష్యంగా చేసుకుని, అన్ని వ్యవస్థలనూ అడ్డంపెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రక్రియలో రానున్న రెండ్రోజుల్లో మరిన్ని కుటిల రాజకీయాలు అమల్లోకి రానున్నాయా?

వైఎస్ సునీత ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా.. వివేకానందరెడ్డి హత్య కేసును ట్విస్ట్ చేసి.. వైఎస్ కుటుంబీకులనే ఇబ్బందుల పాల్జేస్తూ.. తద్వారా ప్రథమ లక్ష్యం అయిన కడప ఎంపీ సీటును టార్గెట్ చేయడంతో పాటు, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లకు రెచ్చగొట్టే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విలన్ గా చేసే ప్రక్రియ మొదలుకానుందా?

ప్రభుత్వ వ్యతిరేకత పతాక స్థాయికి చేరిన వేళ.. ఐదేళ్లలో ఏం సాధించామో చెప్పుకుని ఓటు అడగలేక.. జగన్, జగన్ అంటూ.. జగన్ వస్తే అలా, జగన్ వస్తే ఇలా.. అంటూ పోచికోలు మాటలు చెబుతూ రాజకీయం సాగిస్తున్న వాళ్లు మరో తెగింపు రాజకీయాన్ని అమల్లో పెట్టనున్నారనే మాట వినిపిస్తూ  ఉంది.

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు అధికారంలో ఉన్న వారి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని, వారి కనుసన్నల్లోనే మొత్తం జరిగిందనే మాట వినిపిస్తూ ఉంది. వారు తమచేతికి మట్టి అంటకుండా... వేరే ఆస్తుల వ్యవహారాలను ఉపయోగించుకుని, కిరాయి మూకతో పనికానిచ్చారని.. ఆ కిరాయి మూకకు ధైర్యాన్ని ఇచ్చింది మాత్రం కడపజిల్లాకు చెందిన ఫ్యాక్షన్ రాజకీయ నేతలే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ కుతంత్రంలో తర్వాతి పార్ట్ వైఎస్ కుటుంబీకులను లక్ష్యంగా చేసుకోవడమే అని, ఎలాగూ సిట్ అంటే సిట్ , స్టాండ్ అండే స్టాండ్ కాబట్టి.. ఇంతవరకూ ఐదేళ్లలో ఏయే కేసుల్లో సిట్ లు ఏమేం తేల్చాయో అందరికీ తెలిసిందే కాబట్టి.. వివేక హత్యను అధికారంలో ఉన్న వారి ప్రయోజనాలకు అనుకూలంగా ట్విస్ట్ చేయడం ఏమాత్రం కష్టం కాదు కూడా.

ఇప్పుడు అదే జరగబోతోందని.. కడప ఎంపీ సీటును టార్గెట్ గా చేసుకుని, రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు పురికొల్పే సంఘటనలు జరగబోతూ ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏం చేసి అయినా.. అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ప్రక్రియలో అత్యంత దారుణమైన ఘటనలో మరికొన్ని ఘటనల్లో జరగబోతున్నాయనే మాట వినిపిస్తోంది!

ఇక జరిగేది రసవత్తర రాజకీయం కాదని, దారుణ మారణ రాజకీయం జరిగినా ఆశ్చర్యం లేదని.. పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.

అప్నా టైం ఆయేగా సాబ్ 

చెట్టు పేరుతో ఓట్లు అడుక్కోవడం.. ఎన్నాళ్లిలా 

Show comments