మహేష్ మాట కోసం వెయిటింగ్

మొత్తానికి మహర్షి తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు చేయబోయే సినిమా పక్కా అయినట్లే. అనిల్ రావిపూడి డైరక్షన్ లో సినిమా వుంటుంది. అనిల్ సుంకర నిర్మాత. అయితే మరో నిర్మాత దిల్ రాజు కూడా భాగస్వామిగా వుంటారా? వుండరా? వుంటారనే వినిపిస్తోంది.

అయితే అనిల్ సుంకర, దిల్ రాజుల మధ్య ఏకాభిప్రాయం వచ్చిందని, కేవలం మహేష్ దాన్ని ఓకె చేయాల్సి వుందని తెలుస్తోంది. అనిల్ సుంకర తన లేటెస్ట్ సినిమా (గొపీచంద్) వ్యవహారాల్లో బిజీగా వున్నారు. అందువల్ల మహేష్ ప్రొసీడ్ అని లాంఛనంగా అంటే ఈ ఇద్దరు నిర్మాతలు కలిసి ముందుకు సాగుతారు.

మహేష్ సూచన మేరకు ఇద్దరు నిర్మాతల మధ్య డిస్కషన్లు సాగినట్లు వినిపిస్తోంది. ఫైనల్ నిర్ణయం మహేష్ కే వదిలేయాలని అనుకున్నట్లు బోగట్టా. మరి మహేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు వస్తుందో? వాస్తవానికి మహేష్ తరువాత సినిమాను మైత్రీమూవీస్ సంస్థ సుకుమార్ డైరక్షన్ లో నిర్మించాల్సి వుంది. కానీ అది వెనక్కు జరిగింది.

అనంతపురం అర్బన్..వైసీపీలో మళ్లీ పాత గొడవే?

వాళ్లు ఎమ్మెల్యేలు, అదో మంత్రివర్గమా?