దటీజ్ జగన్: ప్రతి అడుగు ప్రత్యేక హోదా వైపే..!

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే...
రాష్ట్ర విభజన నుంచి ఇదే మాటపై యుద్ధం చేస్తున్నారు ప్రతిపక్షనేత, వైఎస్ఆర్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. ఈ విషయంలో ఎన్నో పార్టీలు, ఎంతోమంది మనుషులు మాట మార్చారు. మడమ తిప్పారు. కానీ జగన్ ది మాత్రం ఒకటేమాట. రాముడిది ఒకటేమాట, ఒకటే బాణం అన్నట్టు.. జగన్ కూడా ప్రత్యేక హోదాపై మాటకు కట్టుబడి ఉన్నారు.

ప్రత్యేకహోదా ఎవరిస్తే వాళ్లకే మద్దతిస్తామని ఎప్పట్నుంచో చెబుతున్నారు జగన్. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో కూడా జగన్ ది ఇదేమాట. చివరికి జాతీయస్థాయిలో ఏర్పాటుకానున్న ఫెడరల్ ఫ్రంట్ విషయంలో కూడా జగనే నిక్కచ్చిగా వ్యవహరించడం అతని చిత్తశుద్ధిని చాటిచెబుతోంది.

ఫెడరల్ ఫ్రంట్ పై కొద్దిసేపటి కిందట జగన్, కేటీఆర్ మధ్య చర్చలు జరిగాయి. త్వరలోనే కేసీఆర్ తో కూడా ఈ విషయంపై జగన్ చర్చించబోతున్నారు. ఇక్కడ కూడా ప్రత్యేకహోదా అంశాన్నే లేవనెత్తారు జగన్. ఏపీకి ప్రత్యేకహోదా తీసుకొచ్చేలా వ్యవహరిస్తేనే ఫెడరల్ ఫ్రెంట్ కు మద్దతిస్తానని కుండబద్దలు కొట్టారు. కేవలం చర్చల్లో చెప్పడంకాదు, ఇదే విషయాన్ని మీడియా ముఖంగా కూడా జగన్ చెప్పడం విశేషం.

దీనిపై కేటీఆర్ కూడా సానుకూలంగా స్పందించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే విషయంలో తమ పార్టీ వ్యతిరేకం కాదని కేటీఆర్ స్పష్టంచేశారు. మరోవైపు చర్చల్లో భాగంగా ఇదే అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా జగన్ ఫోన్ లో మాట్లాడారు.

కేసీఆర్ నుంచి కూడా సానుకూల స్పందన వచ్చింది. అవసరమైతే ఉన్నఫలంగా ఇప్పటికిప్పుడు ఏపీకి ప్రత్యేకహోదాపై కేంద్రానికి లేఖ రాయడానికి తను సిద్ధమని కేసీఆర్ తన అభిప్రాయాన్ని విస్పష్టంగా చెప్పారు. ఇలా టీఆర్ఎస్ పార్టీ నుంచి విస్పష్టంగా హామీ తీసుకున్న తర్వాతే ఫెడరల్ ఫ్రంట్ కు తన మద్దతు ప్రకటించారు జగన్. అంతేకాదు, రాబోయే ఎన్నికల్లో ఎంపీ సీట్లు అన్నింటినీ వైసీపీకే ఎందుకు కట్టబెట్టాలో, వైసీపీకి మద్దతుగా ఎంపీల సంఖ్య మరింత పెరిగితే కలిగే ప్రయోజనాలేంటో విడమర్చి చెప్పారు.

"రాష్ట్రంలో ఎంపీల సంఖ్య ఆధారంగా చూస్తే ప్రత్యేకహోదా తెచ్చుకునే పరిస్థితి లేదు. 25 మంది ఎంపీలతో మేం ప్రత్యేకహోదా కోసం డిమాండ్ చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. మన ఎంపీలకు తోడు తెలంగాణ ఎంపీలు కూడా తోడై 42 మంది ఎంపీలు, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద ప్రశ్నించగలిగితే రాష్ట్రానికి మేలు జరిగే పరిస్థితులు మెరుగవుతాయి."

కేవలం ప్రత్యేకహోదా సాధన లక్ష్యంగానే ఫెడరల్ ఫ్రంట్ లో జాయిన్ అవుతున్నామని, రాష్ట్రానికి సంప్రాప్తించే హక్కుల్ని కాపాడుకోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్ కు మరింత ప్రయోజనం చేకూర్చే విధంగా ఉంటుందనే ఆలోచనతోనే ఫెడవర్ ఫ్రంట్ కు సపోర్ట్ ఇస్తున్నామనే విషయాన్ని ప్రజలకు స్పష్టంగా చెప్పగలిగారు జగన్. 

కేసీఆర్, చంద్రబాబు ఫ్రంట్ గెలుపెవరిది? 

బాబు, జగన్ తేల్చాలేకపోతున్నారా..!

Show comments