తనతో లిప్ కిస్.. హీరో లక్కీ అంటోంది!

స్టార్ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన షారూక్ ఖాన్ తెరపై ఎవరినీ లిక్ కిస్ పెట్టుకోలేదట చాలా సంవత్సరాల పాటు. బాలీవుడ్ సినిమాల్లో ఎన్నో యేళ్ల నుంచి మూతి ముద్దులున్నాయి. తొంబైలలోనే ఇవి పతాక స్థాయికి వెళ్లాయి. అప్పటి యంగ్ హీరోలు, యంగ్ హీరోయిన్లు లిప్ కిస్ లతో జనాలను అలరించడం ఎక్కువైంది. అయితే అలాంటి ఊపులో కూడా షారూక్ సినిమాల్లో ఏ హీరోయిన్ నీ లిప్ కిస్ పెట్టుకోలేదట.

అయితే ఆ తర్వాత చాలా కాలానికి షారూక్ లిప్ కిస్ పెట్టుకోక తప్పిందికాదు. యశ్ చోప్రా వంటి సీనియర్ దర్శకుడు షారూక్ తో లిప్ కిస్ పెట్టించాడు. అది జబ్ తక్ హే జాన్ సినిమాతో. కొన్నేళ్ల కిందట వచ్చిన ఈ సినిమాలో షారూక్ లిప్ కిస్ పెట్టుకున్నాడు. అది కత్రినా కైఫ్ ని!

ఇప్పుడు షారూక్, కత్రినా మళ్లీ జట్టుకట్టారు. జీరో సినిమాతో వస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో పాత ముద్దు అనుభవాలను కత్రినాతో అడిగింది మీడియా. తెరపై తొలిసారి షారూక్ ను లిప్ కిస్ పెట్టుకున్న హీరోయిన్ నువ్వే కదా.. దీనికి లక్కీగా ఫీల్ అవుతున్నావా అని కత్రినాను ప్రశ్నించింది మీడియా.

వేరే హీరోయిన్లు అయితే ఏమనేవారో కానీ.. కత్రినా మాత్రం గడుసుగానే సమాధానం ఇచ్చింది. షారూక్ ను తొలిసారి తెరపై లిప్ కిస్ పెట్టినందుకు తనేమీ అదృష్ట వంతురాలిని అనుకోవడం లేదని, తనను అలా ముద్దు పెట్టుకున్నందుకు షారూక్ ఖానే లక్కీ ఫెలో అనేసింది కత్రినా!

Show comments