తెలంగాణలో నేతలు చేస్తున్నదాన్ని ఏమందాం లోకేషా!

అవతల తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ పోటీచేస్తున్న అభ్యర్థులంతా తమ ఆస్తుల ప్రకటన చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులంతా తమ కుటుంబాల పేర్ల మీద ఉన్న ఆస్తుల వివరాలను అఫిడవిట్లలో పేర్కొంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ తమనేతలు ఎంత సంపాదనపరులో, ఎంతటి శ్రీమంతులో జనాలు తెలుసుకుంటూ ఉన్నారు.

అవతల అంత జరుగుతుంటే.. రాజకీయాల్లో తాము తప్ప ఎవ్వరూ ఆస్తుల ప్రకటన చేయలేదు.. అంటూ రొటీన్ కామెడీతో వచ్చాడు నారా లోకేష్ బాబు. ఈసారి ఆస్తుల ప్రకటన రోజు ఇదేనట. వరసగా ఎనిమిదో సంవత్సరం ఆస్తుల ప్రకటన చేస్తున్నట్టుగా లోకేష్ గర్వంగా చెప్పుకుంటున్నాడు.

ఈ చెవుల్లో పూలు పెట్టే ప్రకటనలు ప్రతి ఒక్కనేతా చేస్తాడు. ఎన్నికల అఫిడవిట్లో ప్రతి ఒక్కరూ ఆస్తుల వివరాలను పేర్కొంటూ ఉన్నారు. అయితే తాము మాత్రమే ఆస్తుల ప్రకటన చేస్తున్నామని నారా ఫ్యామిలీ నిస్సిగ్గుగా చెప్పుకుంటుంది. వీళ్లకు జనాలు అంతగా లోకువ అయ్యారు మరి.

మిగతావాళ్లు ఎలక్షన్ అఫిడవిట్లో ఆస్తులు పేర్కొంటే.. నారా ఫ్యామిలీ మాత్రం ఈ హరికథలు చెబుతూ ఉంది. ఇక కథల్లో యథావిధిగా తాము ఎంత ఆగర్భ దరిద్రాన్ని అనుభవిస్తున్నామో.. ఎంత పేదవాళ్లమో చెప్పుకున్నాడు లోకేష్ బాబు.

తమ ఆస్తులు విలువ తిప్పి తిప్పి కొట్టినా ఒక మున్సిపల్ కార్పొరేటర్ కుటుంబానికి ఉండే రేంజ్లో కూడా లేవని వివరించాడు. ఇక తాము ఎంత సచ్ఛీలురమో.. ఎక్కడా చట్టానికి దొరకకపోవడమే అందుకు నిదర్శనమని లోకేష్ వివరించాడు.

తమను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని.. ఆస్తుల ప్రకటన చేయాలని చెప్పుకొచ్చాడు. మరి ఎన్నికల సంఘానికి అఫిడవిట్లు ఇస్తున్న వాళ్లంతా లోకేష్ లెక్కలో వెర్రిబాగులోళ్లు. అయినా తమ ఆస్తుల విలువను అంత తక్కువగా చూపడంతోనే.. జనాలను వెర్రిబాగుల వాళ్లను చేస్తున్న వాళ్ల లెక్కలో ఇంకెవరికి విలువ ఉంటుందిలే!

రెడ్డి గారికి తత్వం బోధపడిందా..? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్

Show comments