ప్రధానిగా ఎవరో జనసేన డిసైడ్ చేస్తుందట!

మొత్తానికి ఎవ్వరికి ఎవ్వరూ తగ్గట్లేదు. అవతల ప్రధానిగా ఎవరుండాలో మననేత చంద్రబాబు నిర్ణయిస్తాడని లోకేష్ బాబు చాన్నాళ్ల కిందటే తేల్చిచెప్పాడు. అదే విషయాన్ని లోకేష్ మళ్లీ మళ్లీ చెబుతున్నాడు. తెలుగుదేశం నేతలు వీధుల్లోకి వెళ్లి కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు.

వచ్చే ఎన్నికల తర్వాత ప్రధానిగా ఎవరుండాలో నిర్ణయించేది చంద్రబాబు నాయుడే అని అంటున్నారు వీళ్లంతా. మరి చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో వచ్చేదే నాలుగు ఎంపీ సీట్లని సర్వేలు చెబుతున్నాయి. ఆ ఎంపీ సీట్లతోనే ప్రధానిగా ఎవరుండాలో చంద్రబాబు డిసైడ్ చేసేస్తాడా? అనే వ్యంగ్యం అయితే తప్పడంలేదు.

14 ఎంపీ సీట్లు వచ్చినప్పుడు చంద్రబాబు తేల్చింది ఏమీలేదు. ఇక రేపు ఎన్నికల్లో ఎన్నొస్తాయో తెలీదు కానీ.. చంద్రబాబు మాత్రం ప్రధానిగా ఎవరుండాలో తేల్చుతాడని టీడీపీ వర్గాలు అంటున్నాయి. టీడీపీ అలాంటి కామెడీ చేస్తుంటే.. ఈ విషయంలో మేమేం తక్కువ? అంటోంది జనసేన. ఈ పార్టీ వర్గాలు కూడా రేపు దేశానికి ప్రధానిగా ఎవరుండాలో తేల్చేది పవన్ కల్యాణే అంటున్నాయి.

జనసేన ఇచ్చే సపోర్టును బట్టే ఎవరో ఒకరు ప్రధాని అవుతారని ఈ పార్టీ వాళ్లు అంటున్నారు. జనసేన పార్టీకి బ్రహ్మాండమైన వేవ్ ఉందని.. భారీగా ఎంపీ సీట్లను నెగ్గేస్తుందని.. వాటితో ప్రధానిగా ఎవరుండాలో పవన్ డిసైడ్ చేసేస్తారని ఈ పార్టీ వాళ్లు బాకా ఊదుతున్నారు.

వైసీపీ వాళ్లు మాత్రం ఎవరు రాష్ట్రానికి హోదా అంటే వాళ్లకే సపోర్ట్ అంటున్నారు. టీడీపీ, జనసేనలు మాత్రం.. ప్రధాని అభ్యర్థిని నిర్ణయించేది మేమే అంటున్నాయి. అయినా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడే ఎక్కడా ఒక్క ఎంపీ సీటును నెగ్గలేకపోయారు. ఇప్పుడు జనసేనతో ప్రధాని అభ్యర్థిని నిర్ణయించేస్తాం అంటే దీన్ని మామూలు కామెడీ అనాలా?

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి 

Show comments