బ్లప్ మాస్టర్ వచ్చాడు

తమిళంలో మంచి హిట్ అయిన చిత్రం చతరుంగవేట్టై. ఈ సినిమాను తమిళంలో నిర్మించిన సంస్థ, తెలుగులోకి తెస్తోంది. దీనికి తెలుగు నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ సహకారం అందిస్తున్నారు. తెలుగులో హీరో సునీల్ తో రీమేక్ చేయాలని అనుకున్నారు. అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ తరువాత సునీల్ మార్కెట్ వరుస ఫ్లాపులతో తగ్గిపోవడంతో ప్లాన్ మార్చి, జ్యోతిలక్ష్మి హీరో సత్య దేవ్ ను తీసుకున్నారు.

టీజర్ ను ఈ రోజు బయటకు వదిలారు. టీజర్ చూసిన తరవాత, టైటిల్ కు, టీజర్ కు సత్యదేవ్ పక్కాగా మ్యాచ్ అయ్యాడన్న పీల్ కలిగింది. ఆ ప్లేస్ లో, ఆ లుక్ లో సునీల్ ఊహించడం కష్టమే. అందువల్ల రీప్లేస్ మెంట్ కరెక్ట్ అనిపించింది.

నందిత శ్వేత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు గోపీగణేష్ దర్శకుడు. పులగం చిన్నారాయణ స్క్రిప్ట్ సహకారం అందించారు. టీజర్ కట్ బానే వుంది. ట్రయిలర్ వస్తే కానీ పూర్తి టేస్ట్ అందదు.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి 

Show comments