బొత్సను గడప దాటనీయడం లేదా?

విజయనగరం జిల్లాలో ఆసక్తి రేపుతున్న అసెంబ్లీ సీటుగా చీపురుపల్లి ఉంది. ఇక్కడ సీనియర్ వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ వరసగా అయిదవసారి పోటీ చేస్తున్నారు. ఆయన ఇప్పటికి నాలుగు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు గెలిచిన సక్సెస్ ట్రాక్ రికార్డ్ ఉంది. అలా గెలిచినప్పుడల్లా ఆయన మంత్రిగా పదవులు అందుకున్నారు.

ఈసారి కూడా గెలిచి వైసీపీ అధికారంలోకి వస్తే మరోసారి మంత్రిగా హవా చాటాలని బొత్స భావిస్తున్నారు. బొత్సకు చీపురుపల్లి కంచుకోటగా ఉంటూ వచ్చింది. అయితే అది నిన్నటి మాట అని అక్కడకు శ్రీకాకుళం జిల్లా నుంచి షిఫ్ట్ అయిన వచ్చిన మరో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత కళా వెంకటరావు చెబుతున్నారు.

కళా వెంకటరావు తన రాజకీయ చాతుర్యంతో టీడీపీలో వర్గ పోరుని అధిగమించారు. వైసీపీలో అసంతృప్తులకు గేలమేసి మరీ సైకిలెక్కించే పని ముమ్మరంగా చేస్తూ వస్తున్నారు. తాజాగా ఉత్తరాంధ్ర వైసీపీ విద్యార్ధి విభాగం నాయకుడు, బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతను టీడీపీలో చేర్చుకున్నారు.

దీంతో పోలింగుకు గడువు అతి సమీపంలో ఉన్న వేళ వైసీపీకి గట్టి షాక్ తగిలినట్లు అయింది. చివరి నిముషంలో ఆఖరి జాబితాలో కళా పేరుని చంద్రబాబు ఖరారు చేసినా తన రాజకీయ కళా నైపుణ్యాన్ని పండిన రాజకీయ అనుభవాన్ని ఆయన చూపిస్తున్నారు. దాంతో చీపురుపల్లిలో బొత్సకు ఈసారి ఎన్నికలు అంత ధీమాను ఇవ్వడం లేదు అని అంటున్నారు.

Readmore!

వైసీపీకి  ఏకపక్షంగా ఉన్న మొరకముడిదాం మండలంలో కూడా టీడీపీ పలుకుబడిని పెంచుకుంటూ కళా ముందుకు సాగుతున్నారు. దీంతో బొత్స ఇపుడు చీపురుపల్లి గడప దాటని పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు. ఆయన సతీమణి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. తన సీటులో గెలుపు ఓకే మెజారిటీలే చూసుకోవాలని ఇప్పటిదాకా ధీమాగా ఉన్న బొత్స ఇపుడు గెలుపు కోసం కష్టపడుతున్నారు అని అంటున్నారు.

కళా వెంకటరావు లేట్ గా వచ్చిన లేటెస్ట్ గానే అంతా చేస్తున్నారు. దాంతో చీపురుపల్లిలో పదేళ్ళ తరువాత టీడీపీ జెండా ఎగురుతుందా అన్న దాని మీద తమ్ముళ్ళలో కొత్త ఆశలు పుట్టుకొస్తున్నాయని టాక్.

Show comments