అమరావతి ఎప్పటికీ విశాఖ కాలేదు

వై విశాఖ.. మీద వైఎస్ జగన్ మంచి వివరణ ఇచ్చారు. చెన్నయ్, బెంగళూరు, హైదరాబాద్ లతో పోటీ పడగల సత్తా ఆంధ్రలో కేవలం విశాఖకు మాత్రమే వుందని స్పష్టం చేసారు. అమరావతి బేరన్ లాండ్.. అది ఎప్పటికీ విశాఖ కాలేదు. విశాఖ లా పోటీ పడలేదు అన్ని కుండ బద్దలు కొట్టారు.

విశాఖలో ఇప్పటికే అన్ని విధాలా అన్నీ వున్నాయి. అన్నింటికి మించి కాస్మాపాలిటన్ కల్చర్ వుంది. కాస్త పుష్ ఇస్తే చాలు, పెద్ద పట్టణాలతో పోటీ పడుతుందని అని, అప్పుడు అంతా అంటున్న వైట్ కాలర్, సాఫ్ట్ వేర్ జాబ్ లు వస్తాయని వివరించారు. పెద్దగా పుష్ ఇవ్వాలంటే పెద్ద ఖర్చు పెట్టాల్సిన పని లేదని, కొన్ని ఐకానిక్ బిల్డింగ్స్ కడితే చాలని అన్నారు.

తనకు కొన్ని ఐకానిక్ బిల్డింగ్స్ ఐడియాలు వున్నాయని, విశాఖలో ఓ సెక్రటేరియట్, ఓ స్టేడియం, ఓ కన్వెన్షన్ సెంటర్ కట్టాలని చెప్పారు. టీవీ 9 కు ఇచ్చిన ఇంటర్వూలో జగన్ ఈ విషయంలో చాలా క్లారిటీగా వివరణ ఇచ్చారు. అమరావతిలో వేల ఎకరాలు వున్నాయి కదా, అక్కడ కట్టవచ్చు కదా అని అడిగితే, ‘అమరావతి బారన్ లాండ్… అది విశాఖతో పోటీ పడలేదు’ అని కుండబద్దలు కొట్టారు.

అభివృద్ది ఇది కాదా?

Readmore!

రాష్ట్రంలో అభివృద్ధి లేదు అనే వారికి కూడా జగన్ చెంప చెళ్లు మనేటట్లు సమాధానం ఇచ్చారు. స్వంతంత్రం వచ్చిన నాటి నుంచి 2019 ఆరు ఓడ రేవులు వుంటే, కేవలం ఈ అయిదేళ్లలో నాలుగు కడుతున్నాం. ఇది అభివృద్ది కాదా? కొత్తగా ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాం ఇది ప్రగతి కాదా? కొత్తగా మూడు ఇండస్ట్రియల్ కారిడార్ల పనులు పరుగెట్టిస్తున్నాం… ఇది కనిపించలేదా? గతంలో ఎప్పుడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం. అలాగే ఎయిర్ పోర్ట్ లు.. వాయి వేగంతో జరుగుతున్నాయి కనిపించడం లేదా? ఇది డెవలప్ మెంట్ కాదా? అని జగన్ సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో 32 వేల కోట్ల పెట్టుబడులు వస్తే, తన హయాంలో లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే స్టేటస్ ను ఆంధ్ర ప్రదేశ్ మెయింటెయిన్ చేస్తున్నామన్నారు.

ప్రతి గ్రామంలో

ఇవ్వాళ ప్రతి గ్రామంలో సచివాలయం, ఆ దగ్గరలోనే రైతు భరోసా కేంద్రం, అక్కడకి దగ్గరలోనే విలేజ్ క్లీనిక్ లు కనిపించడం లేదా? ప్రతి గ్రామంలో నాడు నేడు కింద అభివృద్ది చెందిన పాఠశాలలు కనిపించడం లేదా అని జగన్ ప్రశ్నించారు. మండలానికి ఓ సర్వేయర్ లేని పరిస్థితి నుంచి ప్రతి గ్రామంలో ఓ సర్వేయర్ అనే పరిస్థితి తీసుకొచ్చామన్నారు.

లాండ్ రిఫార్మ్స్ అవసరమే

విదేశాల్లో లాండ్స్ కొంటే ఏ వివాదాలు వుండవని, ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి వుండాలన్నదే తన అభిమతమని జగన్ చెప్పారు. ఎవరో ఒకరు అడగు ముందుకు వేయాల్సిందే దీని కోసం, అందుకే తాను అడుగు ముందుకు వేసా అన్నారు. ఇవన్నీ పెర్ ఫెక్ట్ గా మారి, అమలు జరగడానికి కొన్నేళ్ల సమయం పడుతుందన్నారు. ఆ తరువాత ప్రతి యజమానికి క్లియర్ టైటిల్ అందుతుందన్నారు.

విశాఖ నుంచే పాలన

విశాఖ‌నే రాజధాని అన్నది జగన్ మరోసారి క్లారిటీగా చెప్పేసారు. నా ప్రమాణ స్వీకారం అక్కడే. నా పాలన అక్కడి నుంచే అని ఏమాత్రం నాన్చకుండా, కప్పదాటు లేకుండా చెప్పారు.

Show comments