‘రెండో సంతకం’ చంద్రబాబుకు బేడీలు వేయిస్తుందా?

చంద్రబాబు నాయుడు మాటలతో తిమ్మిని బమ్మి చేయగల మహానుభావుడు. గోబెల్స్ ను ఆరాధించే అభినవ రాజకీయ నాయకుడు. ఒకే అబద్ధాన్ని పదేపదే చెప్పడం ద్వారా ప్రజలను నమ్మించాలి.. అనే గోబెల్స్ సిద్ధాంతాన్ని చంద్రబాబు ఇంప్రొవైజ్ చేశారు. ఒకే అబద్ధాన్ని పదిమందితో ప్రతిరోజూ ప్రతిచోటా పదేపదే చెప్పిస్తూ.. ప్రజలు నమ్మేవరకు విడిచిపెట్టకూడదు అనేది ఆయన సిద్ధాంతం. ఆ సిద్ధాంతానికి తగ్గట్టుగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఇప్పుడు విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి.

చంద్రబాబు, పవన్ కల్యాణ్ సహా ఆ పార్టీ నాయకులు అందరూ కొన్ని రోజులుగా కేవలం ఆ చట్టం గురించే మాట్లాడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు పేదల భూములను కబ్జా చేయడం కోసమే ప్రత్యేకంగా ఆ చట్టం తెచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఈ మాటల ద్వారా ప్రజల్లో మరింత భయం పెంచడానికి చంద్రబాబు.. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత.. రెండో సంతకం ఈ లాండ్ టైటిలింగ్ యాక్ట రద్దు ఫైలు మీదనే పెడతానంటూ మరింత డోసేజీ పెంచారు.

అయితే ఈ అతివేషాలన్నీ ఆయనను మళ్లీ కటకటాల వెనక్కు పంపే ప్రమాదం కనిపిస్తోంది. చంద్రబాబునాయుడు అండ్ కో సాగిస్తున్న దుష్ప్రచారం మీద ఎన్నికల సంఘం కన్నెర్ర చేయడంతో ఇప్పుడు సీఐడీ విచారణ నిమిత్తం రంగంలోకి దిగింది.

లాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నాయని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఈ చట్టంపై నిర్ధారణ కాని, తప్పుడు ఆరోపణలు ప్రచారంలో పెడుతున్నారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై దీనిపై విచారించి, తప్పుడు ప్రచారం చేస్తున్న సంగతి నిజమైతే వారిమీద చర్యలు తీసుకోవాలని, ఏ చర్యలు తీసుకున్నారో కూడా నివేదికను తిరిగి తమకు పంపాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

Readmore!

ఈసీ చర్యలు తీసుకోవాల్సిందిగా సీఐడీని ఆదేశించడంతో ఇప్పుడు ఈ విషయంలో హీట్ పెరిగినట్టు లెక్క. కేవలం ఐవీఆర్ ఎస్ కాల్స్ ప్రచారం వరకు ఉండిఉంటే బేడీలు ఎవరికి పడతాయనే డౌటుండేది. కానీ.. తాను ప్రజలను ఉద్ధరిస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చుకోవడానికి, అధికారంలోకి రాగానే.. ఈ చట్టాన్ని రద్దు చేయడానికే రెండోసంతకం పెడతానని ప్రకటించడం వల్ల .. ఈ మొత్తం ప్రచారం వెనుక ఉన్నది ఆయనే అనే అనుమానం అందరికీ కలుగుతోంది.

విచారణలో భాగంగా సీఐడీ చంద్రబాబును పిలిపించి మాట్లాడవచ్చునని, ఆయనను అరెస్టు చేసే అవకాశం కూడా ఉందని ప్రజలు అనుకుంటున్నారు.

Show comments