పవన్ కీలక ఆదేశాలు!

రాను రాను పూర్తిగా పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా మారుతున్నారు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్. ఎన్నికల వ్యూహాలను బాగానే రచిస్తున్నారు. పోలింగ్ తేదీ మరో రెండు వారాల్లో వుంది. ఇలాంటి టైమ్ లో పార్టీకి ఏమాత్రం డ్యామేజ్ జరగకూడదని ఆలోచిస్తూ, పార్టీ జనాలకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఆ ఆదేశాల సారాంశం ఏమిటంటే, పార్టీ లీడర్లు ఎవరూ ఏ ప్రైవేటు ఇంటర్వూలు ఇవ్వవద్దని. అలా ఇచ్చి, ఏదో ఒక పాయింట్ లో నోరు జారి ఏదైనా మాట్లాడితే, దాని ప్రభావం ఎన్నికల మీద పడుతుందన్నది పవన్ ఆలోచనగా తెలుస్తోంది.

అందుకే స్క్రిక్ట్ ఆదేశాలు జారీ చేసారట. ఎవరు పడితేవారు వారు, ఎడాపెడా ఇంటర్వూలు ఇచ్చేయవద్దని, అవన్నీ పార్టీ చూసుకుంటుందన్నది ఆ ఆదేశాల సారాశం అని తెలుస్తోంది. పార్టీ పబ్లిసిటీ వింగ్ టోటల్ ప్రచారాన్ని నిత్యం పర్యవేక్షిస్తోంది. ఈ మేరకు వున్న కమిటీ డైలీ ఉదయాన్నే సమావేశమై, ఎలా ముందుకు వెళ్లాలి, ముందు రోజు జరిగిన ప్రచారం తీరు తెన్నులు ఇలా అన్నీ డిస్కస్ చేస్తోందట.

గతంలో పవన్ వ్యవహార శైలితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మారింది. ఎందుకంటే విపరీతంగా కష్టపడుతున్నారు. అటు పిఠాపురంలో తిరుగుతూనే, జనసేన పోటీ చేస్తున్న నియోజక వర్గాల్లో కూడా ప్రచారం చేస్తున్నారు. గతంలో పవన్ ఈ రేంజ్ లో తిరగడం అన్నది లేదు. ఇప్పుడు మాత్రం అస్సలు గ్యాప్ లేకుండా ప్రచారంలో పాల్గొంటున్నారు.

Readmore!

Show comments