ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌.. రెండు వేల వీడియోలా!

మాజీ ప్ర‌ధాన‌మంత్రి దేవేగౌడ మ‌న‌వ‌డు, క‌ర్ణాట‌క‌లోని హ‌స‌న్ నియోజ‌క‌వ‌ర్గం ఎన్డీయే అభ్య‌ర్థి ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ వీడియోల స్కామ్ అర్రీబుర్రీది కాద‌ని స్ప‌ష్టం అవుతోంది. క‌ర్ణాట‌క‌లో గ‌తంలో కూడా రాజ‌కీయ నేత‌ల‌కు సంబంధించిన ఇలాంటి వీడియోలు దుమారం రేపాయి! వాటి మ‌ధ్య‌న ఇదేమంత పెద్ద విష‌యం కాద‌నే వాద‌న మొద‌ట్లో వినిపించినా, అయితే ప్ర‌జ్వ‌ల్ డీప్ ట్ర‌బుల్స్ లో ఉన్నాడ‌ని స్ప‌ష్టం అవుతోంది. చివ‌ర‌కు కుటుంబ పార్టీ అయిన జేడీఎస్ నుంచి అత‌డిని స‌స్పెండ్ చేశారంటే ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు!

ఇంత దుమారంలోనూ అత‌డి ల‌క్ ఏమిటంటే.. హ‌స‌న్ లోక్ స‌భ సీటు పోలింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం అత‌డు జ‌ర్మ‌నీలో ఉన్నాడ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. లీక్ ను ఎక్స్ పెక్ట్ చేసి, పోలింగ్ పూర్త‌యిన వెంట‌నే అత‌డు పరార్ అయిన‌ట్టుగా ఉన్నాడు! ఇప్పుడ‌ప్పుడు అత‌డు ఇండియాకు రాక‌పోవ‌చ్చు. ఎలాగూ క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ స‌ర్కారు దీన్ని సీరియ‌స్ గా తీసుకుంటుంది!

ఇది అల్లాట‌ప్పా వ్య‌వ‌హారం కాద‌ని స్ప‌ష్టం అవుతోంది. బ‌య‌ట ప‌డిన ప్ర‌జ్వ‌ల్ పెన్ డ్రైవ్ లో ఏకంగా రెండు వేల‌కు పైనా వీడియోలున్నాయ‌ట‌! అవ‌న్నీ అత‌డు త‌న ఫోన్ తో తీసుకున్న‌వేన‌ట‌! మ‌రి అత‌డు ఇలా వేల సంఖ్య‌లో ఎందుకు వీడియోలు తీసుకున్నాడు, వాటిని భ‌ద్ర‌ప‌రుచుకుని ఏం సాధిద్దామ‌నుకున్నాడో మ‌రి! అత‌డు రెండు వేల వీడియోల‌ను తీసి పెట్టుకున్నాడంటే.. అత‌డి బాధితులు ఎంత‌మంద‌నేది కూడా ప్ర‌శ్న‌గా మారింది! 

ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌జ్వ‌ల్ బాధితురాలు అత‌డి ఇంట్లో ప‌నిమనిషే! అత‌డు త‌న‌ను అనేక సార్లు వేధించిన‌ట్టుగా ఒకామె ఫిర్యాదు చేసింది. మ‌రి అస‌లు క‌థ ఏమిటో.. పెన్ డ్రైవ్ కు ఎరుక‌! 

Readmore!

Show comments