2 వారాల గ్యాప్ లో 2 పెద్ద సినిమాలు?

భారతీయుడు-2 సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలనే అంశంపై చాలా చర్చలు సాగాయి. ఓవైపు షూటింగ్ పెండింగ్ లో పడడం, మరోవైపు దర్శకుడు-హీరో పలు సందర్భాల్లో అందుబాటులోకి రాకపోవడంతో వాయిదాల మీద వాయిదాలు తప్పలేదు. ఎట్టకేలకు జూన్ లో థియేటర్లలోకి వస్తామని తాజాగా ప్రకటించారు.

అలా ప్రకటించిన తర్వాత కూడా సస్పెన్స్ తప్పలేదు. ఎందుకంటే, ఏ తేదీకి వస్తుందనేది అందర్లో టెన్షన్. ఇప్పటికే కల్కి సినిమాను జూన్ 27కు షెడ్యూల్ చేశారు. ఆ సినిమాకు 2 వారాల ముందు లేదా 2 వారాల తర్వాత మాత్రమే భారతీయుడు-2 రావాల్సి ఉంటుంది.

తాజా సమాచారం ప్రకారం భారతీయుడు-2 సినిమాను జూన్ 13న విడుదల చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రకటన మరికొన్ని రోజుల్లో రాబోతోంది. అలా 2 వారాల గ్యాప్ లో కల్కి, భారతీయుడు-2 సినిమాలొస్తున్నాయి.

భారతీయుడు-2 సినిమా డేట్ వస్తే, ఆ వెంటనే గేమ్ ఛేంజర్ విడుదల తేదీ కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే, భారతీయుడు-2 రిలీజైన తర్వాతే గేమ్ ఛేంజర్ థియేటర్లలోకి రావాలనే రూల్ ఉంది. సో.. అతి త్వరలోనే గేమ్ ఛేంజర్ విడుదల తేదీ కూడా బయటకొచ్చే అవకాశం ఉంది. 

Readmore!

Show comments

Related Stories :