దారిమళ్లిన అందం..ఎంత బాగుందో

‘ఇంతందం..దారి మళ్లిందా..భూమిపైకే చేరుకుందా..’ అంటూ సాగిందా పాట. అభిరుచి వున్న దర్శకుడు హను రాఘవపూడి, టేస్ట్ వున్న నిర్మాతలు స్వప్నదత్..ప్రియాంక దత్..వారి వెనుక బ్యాక్ బోన్ లా నాగ్ అశ్విన్ … హీరోగా దుల్కర్ సల్మాన్. ఇంత మంది కలిస్తే మంచి పాట కాక మరేం వస్తుంది. సీతారామం అంటూ హాయి యైన టైటిల్ తో వస్తున్న సినిమా నుంచి పాటను విడుదల చేసారు.

విశాల్ చంద్రశేఖర్ స్వరాలకు కృష్ణ కాంత్ గీతం అందించారు. ఎస్పీబీ చరణ్, కొంతమంది బాల గాయనీ గాయకులతో కలిసి ఆలపించారు. లేకుంటే చెక్కి వుంటారా అచ్చం నీలా శిల్పసంపద..అంటూ కొనసాగిందీ గీతం.’’.. చిలకే కోకకట్టి..నిన్నే చుట్టుముట్టి, సీతాకోకాలాయెనా? విల్లే ఎక్కుబట్టి, మెళ్లో తాళి కట్టి, మళ్లీ రాముడవ్వనా..’’ అనే లైన్ లు బాగున్నాయి.

ఓల్డ్ స్టయిల్ మెలోడీ ట్యూన్ ను విశాల్ అందించడంతో పాటు ఇనుస్ట్రుమెంటేషన్ ను కూడా చాలా హాయిగా వుండేలా అందించారు. దానికి తగినట్లు సాగింది చరణ్ స్వరం. చిత్రీకరణ కూడా హాయిగా సాగింది. అటు విదేశీ, ఇటు స్వదేశీ లోకేషన్ల ను కలగలిపిన తీరు బాగుంది.

వీడియోలో దుల్కర్, మృణాల్ అందంగా కనిపించారు. లోకేషన్లు బాగున్నాయి. ఆగస్ట్ అయిదున ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. 

Show comments