నంద్యాల రవికి సినిమా జనాల అండ

కోవిడ్ కారణంగా ఆసుపత్రిలో చేరిన రచయిత నంద్యాల రవికి పలువురు సినిమా ప్రముఖులు అండగా నిలబడ్డారు. ఇప్పటికే కమెడియన్ సప్తగిరి లక్ష రూపాయలు అందించగా, నిర్మాత రాధామోహన్ లక్ష రూపాయిలు అందించారు. నిజానికి నంద్యాల రవికి ఈ విషయంలో అండగా నిలిచింది హీరో నాగశౌర్య ఫ్యామిలీ.

ఆసుపత్రిలో బెడ్ దొరక్క పోతే నిర్మాత భరత్ చౌదరి సాయంతో బెడ్ సంపాదించి, మెగాస్టార్ బ్లడ్ బ్యాంక్ సాయంతో ప్లాస్మా తెప్పించి సకాలంలో ట్రీట్ మెంట్ అందేలా చేసారు. 

ఇప్పటి వరకు లక్షరూపాయలు నంద్యాల రవి భార్యకు అందించారు. నిత్యం ఆసుపత్రి వైద్యులతో మాట్లాడుతూ కావాల్సిన మందులు, ఇంజక్షన్లు తెప్పించి అందచేస్తున్నారు. 

గ్రేట్ ఆంధ్రలో వార్త చూసి పలువురు సినిమా జనాలు నంద్యాల రవి భార్య ఫోన్ నెంబర్ అడిగి తీసుకున్నారు. మరి వీరిలో ఎందరు సాయం ప్రకటిస్తారో తెలియాల్సి వుంది. 

Show comments