బాలీవుడ్ లోకి వివి వినాయక్

తెలుగు సినిమాల్లో తనదంటూ ఓ ముద్రవేసిన మాస్ సినిమాలను అందించిన దర్శకుడు వివి వినాయక్ బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. 

రాజమౌళి ఎవర్ గ్రీన్ హిట్ సినిమా ఛత్రపతితో ఆయన బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ మేరకు అంతా రెడీ అయింది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బాలీవుడ్ నిర్మాతలు ఛత్రపతి సినిమాను రీమేక్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ముందు సాహో సుజిత్ ను అనుకున్నారు. 

కానీ ఆయన వేరే సినిమా మీద వుండడంతో కుదరలేదు. ఇలాంటి టైమ్ లో వివి వినాయక్ అయితే అన్ని విధాలా ఈ సబ్జెక్ట్ కు ఫిట్ అని ఫిక్స్ అయ్యారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను అల్లుడు శ్రీనుగా మార్చి తోలిసినిమా అందించింది వివి వినాయక్ నే. ఇప్పుడు అదే హీరోతో కలిసి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు...

గ్రేటర్ గెలుపు ఎవరిది

Show comments