ఓటీటీలోకి సీనియర్ హీరో సినిమా

ఇన్నాళ్లూ ఓటీటీలో యంగ్ హీరోస్ సినిమాలు మాత్రమే చూశాం. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోల సినిమాలు ఓటీటీలోకి వస్తాయా? ఎంత కష్టమైనా వాళ్లు థియేటర్లలోనే తమ సినిమాల్ని రిలీజ్ చేస్తారు కదా! అయితే నాగార్జున మాత్రం ఈ భ్రమల్ని తొలిగించే కార్యక్రమం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే సినిమా చేస్తున్నాడు నాగ్. ఈ మూవీని నేరుగా ఓటీటీ రిలీజ్ కు ఇచ్చే ఆలోచన చేస్తున్నారట మేకర్స్. నాగ్ ఒప్పుకుంటేనే ఆ పని జరుగుతుంది. సో.. నాగార్జున కూడా వైల్డ్ డాగ్ ను ఓటీటీకి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది ఇన్ సైడ్ టాక్.

అయితే ఇక్కడ చిన్న మెలిక ఉంది. వైల్డ్ డాగ్ సినిమాను ఒకేసారి ఇటు థియేటర్లతో పాటు, అటు ఓటీటీలో విడుదల చేసే ఆలోచన చేస్తున్నాడట నాగ్. ధైర్యం, ఆసక్తి ఉన్న వాళ్లు థియేటర్ కు వచ్చి చూస్తారు.. అప్పుడే థియేటర్లు ఎందుకు అనుకునేవాళ్లు ఓటీటీలో చూస్తారు.

ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ తో వైల్డ్ డాగ్ యూనిట్ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. వైల్డ్ డాగ్ మూవీ జానర్ కు లాంగ్వేజ్ తో సంబంధం లేదు, ఓటీటీలో రీచ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే నాగ్ ఇలా డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రాబోతోంది. 

గ్రేటర్ గెలుపు ఎవరిది

Show comments