అంబులెన్సుల్లోనూ బీజేపీకి వాటా?

మంచికి అందరూ నేస్తాలే. చెడితే మాత్రం మా బాధ్యత లేదంటారు. ఇది లోక రీతి. అంతకు మించి రాజనీతి. ఇంకా చెప్పాలంటే అచ్చమైన  బీజేపీ రీతి. అందుకే ఏపీలో ఏ మంచి పనులు జరిగినా ఆ క్రెడిట్ మాదేనని చెప్పుకోవడానికి కమల కుతూహలం ప్రదర్శిస్తున్నారు.  తాజాగా ఏపీ సీఎం జగన్ ప్రారంభించిన  108, 104 అంబులెన్సులు ఎక్కడ లేని పేరు తెస్తున్నాయి. జాతీయ స్థాయిలోనూ ఏపీ పేరు మోగుతోంది.

ఒకటి రెండు కాదు ఏకంగా 1088 అంబులెన్సులను ఒకేసారి ప్రారంభించి జగన్ మొనగాడు అనిపించుకున్నారు. ప్రత్యర్ధిగా ఉన్న పవన్ సైతం శభాష్ జగన్ అనేశారు. మరి ఇంతలా అందరూ పొగిడినా కూడా ఏపీలోని టీడీపీ, బీజేపీ నేతలకు మాత్రం అందులోనూ రాజకీయమే కనిపిస్తోంది.

బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఈఅంబులెన్సుల క్రెడిట్ మొత్తం జగన్ సర్కార్ ది కాదు అని తాపీగా చెబుతున్నారు. అందులో కేంద్రం నింధులు ఉన్నాయని, అది వైసీపీ చెప్పడంలేదని అంటున్నారు. అందువల్ల జగన్ కి వస్తున్న కీర్తిలో మా వాటావే ఎక్కువ అని లెక్కలేస్తున్నారు.

ఏపీలో ప్రతీ పధకం వెనకా మేమే ఉన్నాయమని కూడా బీజేపీ ఎమ్మెల్సీ చెప్పుకోవడం నిజంగా రాజకీయమే. నిజంగా అది వాస్తవం అనుకున్నా బీజేపీ పాలిత రాష్ట్రాలో ఈ తరహా అంబులెస్నులు ఎందుకు లేవు అంటే కాషాయదళం గుటకలు మింగాల్సిందే మరి.

ఏపీలో మూడు నెలలుగా కరోనా టెస్టులు చక్కగా చేస్తూ ట్రేసింగ్ తో  పాటు ట్రీట్మెంట్ కూడా ఏపీ సర్కార్ చేస్తోంది. మరి బీజేపీ రాష్ట్రాల్లో ఇది ఎందుకు చేయడంలేదూ అని అడిగితే ఏమంటారో. ప్రతీ  దానికీ బండగా మేము నిధులు ఇచ్చాం కాబట్టి చేస్తున్నారు అని బీజేపీ పెద్దలు  అనడం అలవాటు అయిపోయిందని వైసీపీ నేతలే అంటున్నారు.

ఇన్ని మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్సీ ఈ అంబులెన్సుల ఆపరేషన్ ఒకే సంస్థకు ఇవ్వడం పట్ల మాత్రం అచ్చం టీడీపీ తరహాలోనే అనుమానాలు ఆరోపణలూ చేస్తున్నారు. అంటే శుభం పలకుండానే ఆప‌ శకునం అన్నమాట. మరి ఈ విధంగా హ్రస్వ ద్రుష్టితో చూస్తూ రాజకీయాలు చేయాలనుకుంటే ఎప్పటికి ఏపీ జనం నమ్మ‌రు కమలనాధులూ అంటే జవాబు బహుశా ఉండదేమో.

రఘురామకృష్ణంరాజు దిగజారిపోయాడు

ఇక నుంచి నో లంచం నో దళారీ

Show comments