విల‌క్ష‌ణ న‌టుడి త‌న‌యుడు బ్యాడ్ బాయ్‌

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వార‌సుల రాక స‌ర్వ‌సాధార‌ణ‌మైంది. ఒక వ‌య‌స్సు వ‌చ్చాక సినిమాల్లోకి ఎంట‌ర్ కావ‌డ‌మే ఆల‌స్యం అన్న‌ట్టుగా ప‌రిస్థితి త‌యారైంది. అయితే టాలెంట్ ఉన్న వాళ్లు మాత్రం కొంత కాలం ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకుంటున్నారు. కేవ‌లం వార‌స‌త్వ‌మే వాళ్ల‌ను ఇండ‌స్ట్రీలో నిల‌బెట్ట‌లేక‌పోతోంది.

తాజాగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌రో వార‌సుడు ఎంట‌ర్ అయ్యాడు. ప్ర‌ముఖ బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి త‌న‌యుడు న‌మషి బ్యాడ్ బాయ్ అనే చిత్రంతో వెండితెర‌కి ప‌రిచ‌యం కాబోతున్నాడు. ఈ మూవీని రాజ్‌కుమార్ సంతోషి తెర‌కెక్కిస్తున్నాడు. తాజాగా బాలీవుడ్ అగ్ర‌హీరో స‌ల్మాన్‌ఖాన్ త‌న ట్విట‌ర్ ద్వారా బ్యాడ్ బాయ్ మూవీ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశాడు.  ఈ సంద‌ర్భంగా న‌మిషికి శుభాకాం క్ష‌లు తెలియ‌జేస్తూ .. పోస్ట‌ర్ అద్భుతంగా ఉంద‌ని స‌ల్మాన్‌ కామెంట్ పెట్టాడు.

మిథున్ చక్రవర్తి  బెంగాలీ అయినప్పటికీ హిందీ చిత్రాలలో రాణించాడు. ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు బ్యాడ్ బాయ్ చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో న‌మ‌షీ చ‌క్ర‌వ‌ర్తి స‌ర‌స‌న అమ్రిన్ ఖురేషీ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ చిత్రం త‌న‌ క‌ల‌ని నిజం చేయ‌నుంద‌ని న‌మిషి పేర్కొన్నాడు. సినిమా షూటింగ్‌లో ప్ర‌తి క్ష‌ణం ఎంజాయ్ చేసిన‌ట్టు అత‌ను పేర్కొన్నాడు.

టాలీవుడ్ కు ఆంధ్ర ప్రభుత్వం అంతగా ఆనడం లేదు