సంక్రాంతికి ఆ రెండూ లేనట్లే

కరోనా వచ్చి టాలీవుడ్ సినిమాలు, షెడ్యూళ్లను మిక్సీ లో వేసి తిప్పేసినట్లు తిప్పేసింది. దీంతో ఏ సినిమా ఎప్పుడు రెడీ అవుతుందో? ఏ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో? ఏ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో అన్నది తెలియకుండా అయిపోయింది. ఏ విషయం కూడా అంచనాకు అందేలా లేదు. ఇలాంటి నేపథ్యంలో ప్రభాస్ రాథేశ్వామ్, మెగాస్టార్ ఆచార్య 2021 సంక్రాంతికి విడుదలవుతాయి అని వినిపించింది.

అయితే ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా ప్రకారం ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతికి రావడం కష్టమే అని వినిపిస్తోంది. మెగాస్టార్ ఆచార్య  సినిమా షూటింగ్ నే ఇంకా 60 రోజులకు పైగా వుందని. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మరో నెలన్నర నుంచి రెండు నెలలు వుంటుందని తెలుస్తోంది. అన్నిటికి మించి ఈ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నాడన్నది ఇప్పటికి అయితే చలామణీలో వుంది. మరి ఆర్ఆర్ఆర్ సినిమానే సమస్యల్లో చిక్కుకున్న నేపథ్యంలో ఈ సినిమాకు రామ్ చరణ్ డేట్ లు ఎప్పుడు ఇస్తాడు అన్నది తెలియాల్సి వుంది. ఒక వేళ సంక్రాంతికి రాలేకపోతే, చాలా ఇబ్బందే. మళ్లీ సరైన డేట్ కోసం వెదుకులాడాలి.

ఇదే సమస్య ప్రభాస్ రాథేశ్వామ్ కు కూడా వుందని తెలుస్తోంది. ఆ సినిమా షూట్ వరకు అయిపోతుంది. కానీ దానికి కాస్త ఎక్కువ విఎఫ్ఎక్స్ పనులు వున్నాయని బోగట్టా. అవన్నీ ఇప్పట్లో పూర్తయ్యేవి కాదు. అందువల్ల ఆ సినిమా కూడా సంక్రాంతికి రావడం కష్టమే అని వినిపిస్తోంది.

ఇక మిగిలింది పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' నే. మొన్నటి వరకు అనిల్ రావిపూడి ఎఫ్ 3 వస్తుంది అనుకున్నారు. కానీ హీరో వెంకటేష్ కరోనా వాక్సీన్ వచ్చే వరకు షూటింగ్ లకు రాకూడదని డిసైడ్ అయినట్లు బోగట్టా.,  అందువల్ల ఎఫ్ 3 కూడా పెండింగ్ నే. పవన్ కళ్యాణ్ వీర భక్తుడు హీరో నితిన్ సినిమా రంగ్ దే కూడా సంక్రాంతి బరిలోకి దిగే అవకాశం వుంది.

అపూర్వ ఘట్టానికి సంవత్సరం