డేంజర్ బెల్స్.. ఏపీలో రాత్రికి రాత్రి 21 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఏ రోజుకారోజు ఊహించని విధంగా కేసులు పెరిగిపోతున్నాయి. మొన్నటికిమొన్న ఒకే రోజు 43 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఈసారి రాత్రికిరాత్రి 21 కొత్త కేసులు నమోదవ్వడం అందర్నీ ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య 132కు చేరింది.

నిన్న రాత్రి 10 గంటల తర్వాత విడుదలైన ల్యాబ్ ఫలితాల్లో కొత్తగా 21 పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఒక్కసారిగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. వీళ్లలో చాలామందికి ఢిల్లీ మత ప్రార్థనలతో సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది.

జిల్లాలవారీగా చూసుకుంటే ప్రస్తుతానికి నెల్లూరు, గుంటూరు నుంచి చెరో 20 కరోనా కేసులు వెలుగుచూశాయి. ప్రకాశం నుంచి 17, కడప-కృష్ణా జిల్లాల నుంచి చెరో 15 పాజిటివ్ కేసులు లెక్కతేలాయి. వెస్ట్ లో 14, విశాఖలో 11 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈస్ట్ నుంచి 9, చిత్తూరు నుంచి 8, అనంతపురం నుంచి 2 కరోనా కేసులు ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

మొత్తంగా 1800  శాంపిల్స్ పరీక్షించగా వీటిలో 132 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 1175 మందికి నెగెటివ్ తేలగా.. మరో 493 శాంపిల్స్ రిజల్ట్ కోసం వెయిటింగ్. వెయిటింగ్ లో ఉన్న శాంపిల్స్ నుంచి కనీసం మరో 80 వరకు పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని స్వయంగా అధికారులే చెబుతున్నారు.

సీతారామ కళ్యాణం

తెలుగులో అద్భుతంగా మెసేజ్ ఇచ్చిన నవనీత్ కౌర్

Show comments