లోకేశ్ ద‌ర్శ‌క‌త్వంలో ‘మాస్ట‌ర్’

లోకేశ్ ద‌ర్శ‌క‌త్వంలో ‘మాస్ట‌ర్’  సినిమా తెర‌కెక్క‌నుంది. అర్రె మ‌న లోకేశ్‌లో ఎన్ని క‌ళ‌లున్నాయో అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? అస‌లే సినీ వాతావ‌ర‌ణంలో పుట్టి పెరిగిన లోకేశ్‌కు ద‌ర్శ‌క‌త్వం విద్య ఎప్పుడు అబ్బిందా అని ఆలోచిస్తున్నారా? ఇప్ప‌టికే నారా రోహిత్ హీరోగా కిందామీదా ప‌డుతున్న విష‌యం తెలిసిందే.

కూల్‌...కూల్‌. లోకేశ్ అంటే మ‌న టీడీపీ యువ‌కిశోరం కాదులేండి. త‌మిళ్‌లో లోకేశ్ క‌న‌క‌రాజ్ అనే ద‌ర్శ‌కుడు ఉన్నాడు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న ‘మాస్ట‌ర్’ సినిమాలో విజ‌య్ హీరోగా న‌టిస్తున్నాడు. ఈ చిత్రంలో మాళ‌విక మోహ‌న్ హీరోయిన్‌. కాగా ఈ సినిమాలో విజ‌య్‌ది ద్విపాత్రాభిన‌యం. క‌ళాశాల విద్యార్థిగా, ప్రొఫెస‌ర్‌గా డ‌బుల్ రోల్ పోషిస్తున్నాడు. 

ఈ సినిమా చిత్రీక‌ర‌ణ వేగంగా జ‌రుగుతోంది. ఫ‌స్ట్‌, సెకెండ్ లుక్‌లు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచాయ‌నే టాక్ వినిపిస్తోంది. వేస‌విలో సినిమా విడుద‌ల‌కు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఏప్రిల్ 10న గుడ్ ఫ్రైడేని పుర‌స్క‌రించుకుని సినిమా విడుద‌ల చేయ‌నున్న‌ట్టు కోలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. త‌మిళ సంవ‌త్స‌రాదితో పాటు వ‌రుస‌గా సెల‌వులు వ‌స్తుండ‌టంతో సినిమా విడుద‌ల‌కు అదే స‌రైన స‌మ‌య‌మ‌ని నిర్మాత‌లు భావిస్తున్నార‌ని తెలిసింది. ఈ సినిమాపై అంచ‌నాలు విప‌రీతంగా ఉన్నాయ‌ని స‌మాచారం.

నన్ను దిగిపొమ్మంటారా

'సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న' స్పెషల్ ఇంటర్వ్యూ

Show comments