రేప్ చేసి నడిరోడ్డుపైన పడేశారు

దేశరాజధాని ఢిల్లీకి సమీపంలో మరో దుర్ఘటన చోటు చేసుకుంది. నొయిడాలో ఓ బాలికపై ఐదుగురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత బాలికను రోడ్డుపైన వదిలేసి పరారయ్యారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనం సృష్టించింది.

స్పృహలోకి వచ్చిన బాలిక జరిగిన ఘోరాన్ని పోలీసులకు వివరించింది. తనను అత్యాచారం చేసిన ఐదుగుర్లో ముగ్గురు తనకు తెలిసిన వ్యక్తులే అని తెలిపిన బాలిక, వాళ్లను గుర్తుపడతానని చెప్పింది. వాళ్ల పేర్లు కూడా వెల్లడించింది. దీంతో ఢిల్లీ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాలిక పూర్తిగా కోలుకున్న తర్వాత మరోసారి వాంగ్మూలం రికార్డు చేసి, కేసును నొయిడాకు బదలాయిస్తామని ప్రకటించారు.

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. చట్టాలు చేసినా వాటిని పటిష్టంగా అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమౌతున్నాయంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎన్నో ఏళ్ల కిందట జరిగిన నిర్భయ ఘటనలో నిందితులకు ఇన్నాళ్లకు ఉరిశిక్ష పడుతున్న ఈ దేశంలో, రేప్ కేసులు ఎందుకు తగ్గుతాయని ప్రశ్నిస్తున్నారు. 

ఘటన జరిగిన వెంటనే సత్వరం న్యాయం జరిగేలా, శిక్షలు కఠినంగా ఉండేలా చర్యలు తీసుకున్నప్పుడే ఇలాంటి ఘటనలు తగ్గుతాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో జరిగిన దిశా హత్యాచారం ఘటన మరోసారి తెరపైకొచ్చింది.

నన్ను దిగిపొమ్మంటారా

Show comments