మున్సిపోల్స్ ముగిశాయి.. ఇక ‘రెవెన్యూ’కు రిపేర్లు

సార్వత్రిక ఎన్నికల ముందే ముందస్తుకు వెళ్లి గెలిచిన కేసీఆర్, ఆ వెంటనే రెవెన్యూ డిపార్ట్ మెంట్ ను ప్రక్షాళన చేస్తారని అనుకున్నారంతా. కానీ ఆయన మాత్రం సార్వత్రిక ఎన్నికల వరకు ఆగారు. ఆ తర్వాత కూడా రెవెన్యూ జోలికి వెళ్లలేదు. చివరికి తహశీల్దారుపై పెట్రోల్ పోసి హత్య చేసిన ఘటన తర్వాత కూడా కేసీఆర్ రెవెన్యూ ప్రక్షాళన అంశాన్ని తెరపైకి తీసుకురాలేదు. దీనికి కారణం తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు. 

ఇప్పుడా ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఫలితం టీఆర్ఎస్ కు అనుకూలంగా వచ్చేసింది. ఫలితాలు వచ్చిన రోజే రెవెన్యూ ప్రక్షాళన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు కేసీఆర్. సరికొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తామని సంచలన ప్రకటన చేశారు. కేవలం మున్సిపల్ ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే ఇన్నాళ్లూ వేచిచూసిన కేసీఆర్, ఇప్పుడు పూర్తిస్థాయిలో రెవెన్యూ ప్రక్షాళనకు సిద్ధమయ్యారు. 

దేశంలోనే అవినీతిలో నంబర్ వన్ శాఖగా రెవెన్యూ శాఖ ఉందని, ఇంత అప్రతిష్ట అవసరమా అని ఉద్యోగుల్ని సూటిగా ప్రశ్నించారు కేసీఆర్. ఎంత కడుపు కాలకపోతే పెట్రోల్ డబ్బాలతో ఆఫీసుల్లోకి వస్తున్నారో ఆలోచించాలని గడ్డిపెట్టారు. ఇకపై ఇలాంటివి ఉండవని, రికార్డులు ఎప్పటికప్పుడు అప్ డేట్ అయ్యేలా, ప్రజల సమస్యలు అనుకున్న టైమ్ కు పరిష్కారమయ్యేలా కొత్త చట్టం తెస్తామని స్పష్టంచేశారు. ఎవరికైనా పనిచేయడానికి ఇబ్బందిగా ఉంటే వాళ్లను మరో డిపార్ట్ మెంట్ కు మారుస్తామని కూడా తేల్చిచెప్పారు.

ఆంధ్రప్రదేశ్ లో జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే రెవెన్యూ ప్రక్షాళన మొదలుపెట్టారు. గ్రామ సచివాలయ విధానాన్ని అమల్లోకి తెచ్చి, కొత్తగా ఉద్యోగాలు కల్పించడంతో పాటు రెవెన్యూ ఆఫీసర్ల అధికారాలకు కూడా కత్తెర వేశారు. దాదాపు ఇదే బాటలో కేసీఆర్ కూడా రెవెన్యూ ఉద్యోగుల అధికారాలు కట్ చేయాలని భావిస్తున్నారు. అవినీతి తగ్గాలంటే ఇదొక్కటే మార్గమని ఆయన నర్మగర్బంగా వ్యాఖ్యానించారు. కొత్త రెవెన్యూ చట్టం కఠినంగా ఉంటుందని, అంతా అలవాటు పడాలని కూడా రెవెన్యూ ఉద్యోగుల్ని హెచ్చరించారు

నన్ను దిగిపొమ్మంటారా 

Show comments