అందరూ ఎంజయ్ చేసే సినిమా

ఆడియన్స్ అందరూ బాగా ఎంజాయ్ చేసే సినిమా డిస్కో రాజా. సినిమా చేస్తున్నప్పుడే బాగా ఎంజాయ్ చేస్తూ చేశాను.  దర్శకుడు వి.ఐ.ఆనంద్ సినిమాను బాగా తీశాడు.కచ్చితంగా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది అన్నారు హీరో రవితేజ. ఆయన నటించిన డిస్కో రాజా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం అత్యంత హుషారుగా జరిగింది. ఈ ఈవెంట్ లో రవితేజ మాట్లాడారు.  వెన్నెల కిషోర్, సునీల్, బాబీ సింహ తో బెస్ట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ నాకు దొరికింది. అలాగే సునీల్ తో చాలా కాలం తరువాత సినిమా చేసాను. 

యూజువల్ గా ఒకరిద్దరు హీరోయిన్లు వుంటారు. కానీ ఈ సినిమాలో నాకు ముగ్గురు హీరోయిన్లు వున్నారు. బాగా చేశారు. కెమెరామెన్ కార్తిక్ ఘట్టమనేని బాగా చేశాడు. నేను చూస్తూ పెరిగిన పాత్రలు ఈ సినిమాలో చేశాను, అందరికి నచ్చుతాయి. తమన్ మంచి సాంగ్స్ ఇచ్చాడు. నిర్మాత రామ్ తాళ్లూరి తో చేసిన ఈ రెండో సినిమా నిరుత్సాహ పరచదు. జనవరి 24న మీలాగే నేను ఈ సినిమా కోసం వేచి చూస్తున్నాను అన్నారు.

డైరెక్టర్ విఐ. ఆనంద్ మాట్లాడుతూ తొలిసారి బిగ్ స్టార్ తో చేస్తున్న సినిమా ఇది. రవితేజ నా టైగర్ సినిమా చూసి బెస్ట్ విషెస్ తెలిపారు. ఆయన నన్ను, నా మూవీస్ ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి డైరెక్టర్ రవితేజ తో సినిమా చెయ్యాలి, చాలా నేర్చుకోవాలి, నేను నేర్చుకున్నాను. కెమెరా, ఆర్ట్, మ్యూజిక్ ఇలా అన్ని ఈ సినిమాకు కుదిరాయి. బాబీ సింహ, పాయల్, సభ నటెష్ మిగిలిన ఆర్టిస్ట్స్ అందరూ బాగా చేశారు. ఆడియన్స్ కోరుకుంటున్న అన్ని ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉంటాయి అన్నారు. 

కమెడియన్ సునీల్ మాట్లాడుతూ చాలా కాలం తరువాత మంచి సినిమాలో నటించాను. రవితేజ గారికి థాంక్స్, కొత్తగా మరియు గొప్పగా ఉండబోతుంది డిస్కోరాజా. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్, నిర్మాతకు ధన్యవాదాలు తెలిపారు. 

అతిధిగా వచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ సినిమా ట్రైలర్ సూపర్బ్ గా ఉంది. నిర్మాత రామ్ తాళ్లూరి గారికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను, పాయల్, సభ గారికి బెస్ట్ విశేష్. నేను రాజది గ్రేట్ సినిమా తీసాను రవితేజ తో మళ్ళీ ఎప్పుడెప్పుడు వర్క్ చెయ్యాలని ఎదురు చూస్తున్నాను. మంచి కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.

డైరెక్టర్ వివి.వినాయక్ మాట్లాడుతూ నిర్మాత రామ్ తాళ్లూరి కి గుడ్ లక్, డైరెక్టర్ ఆనంద్ ఈ సినిమాకు డిస్కోరాజా అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు. మా బావ రవితేజ ఎనర్జీతో ఎవ్వరూ మ్యాచ్ అవ్వలేరు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా , ఆనంద్ కు ఈ మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న అన్నారు. 

హీరోయిన్ సభ నటెష్ మాట్లాడుతూ  రవితేజ కు పెద్ద అభిమానిని, రవితేజ ఎనర్జీ ఈ సినిమాకు పెద్ద అసెట్. ఆయనతో నటించడం మెమొరబుల్ ఎక్స్పిరీయన్స్. డైరెక్టర్ విఐ. ఆనంద్ చాలా క్రియేటివ్ గా సినిమా తీశారు, తమన్ పాటలు బాగా పాపులర్ అయ్యాయి. అందరిలానే జనవరి 24న ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న అన్నారు.

Show comments