థమన్ టంగ్ స్లిప్?

సాధారణంగా నాన్ కాంట్రావర్సీ గా వుండే సంగీత దర్శకుడు థమన్. ఇప్పుడు ఆయన కూడా ఫ్యాన్స్ మద్య కాంట్రావర్సీలో చిక్కుకున్నారు. దాదాపు అందరు హీరోలతో స్నేహ సంబంధాలు వున్నాయి థమన్ కు. ఓ మ్యూజిక్ డైరక్టర్ కన్నా కాస్త ఎక్కువ బంధాలనే ఆయనకు అందరితో వున్నాయి. అలాంటిది ఆయన తనకు సంబంధం లేని, తనది కాని వ్యవహారంలో వేలు పెట్టినట్లు అయింది.

అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాల మధ్య ఫ్యాన్స్ వార్ నడుస్తోంది. కలెక్షన్ల ఫిగర్ల మీద దుమారం సోషల్ మీడియాలో రేగుతోంది. ఇలాంటి నేపథ్యంలో డైరక్టర్లు, హీరొలు చాలా సైలంట్ గా వున్నారు. యూనిట్ పీఆర్ టీమ్ ల నుంచి మాత్రమే ప్రకటనలు వస్తున్నాయి. వాటి నేపథ్యంలోనే ఫ్యాన్స్ కిందా మీదా అయిపోతున్నారు. 

'నిజమైన మాటలే మాట్లాడుకుందాం..నిజమైన కలెక్షన్లే చెప్పుకుందాం..' అన్న మాటలు థమన్ నోటి వెంట వచ్చాయి. అనుకోకుండా థమన్ నోటి వెంట వచ్చిన ఈ మాటలకు అల్లు అరవింద్, త్రివిక్రమ్, బన్నీ ఒక్కసారిగా పడి పడీ నవ్వారు. అక్కడికి అది అయిపోయింది.

కానీ ఆ తరవాత రచ్చ ట్విట్వర్ లో మొదలయింది. ఈ మాటలు సరిలేరు నిర్మాత అనిల్ సుంకరకో, లేదా సరిలేరు టీమ్ కో థమన్ ఇచ్చిన కౌంటర్ అన్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ లు, కామెంట్లు మొదలయ్యాయి. పాపం, మాంచి హుషారు, ఊపు మీద వున్న థమన్ ఇలా టంగ్ స్లిప్ కావడంతో అనవసరంగా ఒక వైపు మొగ్గిపోయినట్లు అయిపోయింది. నిజానికి థమన్ మాంచి హిట్ సాంగ్స్ మహేష్ కు కూడా ఇచ్చాడు గతంలో. ఇప్పుడు అదంతా గతం అయిపోయింది. ఈ వర్తమానం మిగిలిపోయింది.

Show comments