నిన్న ప్రకటించారు.. ఈరోజు వాయిదా వేశారు

సుదీర్ఘంగా వాయిదా పడుతున్న ప్రభాస్ సినిమా ఎట్టకేలకు సెట్స్ పైకి వచ్చింది. నిన్నట్నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది. ఈ విషయాన్ని స్వయంగా హీరో ప్రభాస్ ప్రకటించాడు. అయితే ఇలా ప్రకటించారో లేదో అలా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

అన్నపూర్ణ స్టుడియోస్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ సినిమా షెడ్యూల్ నిన్న మొదలైంది. ఇవాళ్టి నుంచి ప్రభాస్-పూజా హెగ్డే మధ్య సన్నివేశాలు తీయాలి. కానీ అనారోగ్య కారణాల వల్ల పూజా హెగ్డే షూటింగ్ కు రావడం లేదు. దీంతో ఈ షూటింగ్ వాయిదాపడింది. అయితే షెడ్యూల్ మాత్రం కాన్సిల్ అవ్వలేదు.

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సాహో టైమ్ లోనే సెట్స్ పైకి తీసుకొచ్చారు. ప్రభాస్-పూజా మధ్య ఫ్రాన్స్ లో ఓ షెడ్యూల్ కూడా చేశారు. ఆ తర్వాత సాహో విడుదలైంది. అది ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమాను పూర్తిగా పక్కనపెట్టేశాడు ప్రభాస్. మరిన్ని మార్పుచేర్పులు సూచించాడు. అలా దాదాపు 6 నెలల పాటు ఆగిపోయిన ఈ సినిమా నిన్నట్నుంచి పట్టాలపైకి వచ్చింది.

ఈ షెడ్యూల్ తర్వాత మరో సెట్ పైకి సినిమాను షిఫ్ట్ చేయాలి. కానీ రామోజీ ఫిలింసిటీలో ఆ సెట్ ఇంకా రెడీ కాలేదని తెలుస్తోంది. సో.. అన్నపూర్ణ స్టుడియోస్ లో ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ తర్వాత సెట్ అందుబాటులోకి వస్తే రామోజీ ఫిలింసిటీలో, లేదంటే ఆస్ట్రియా దేశంలో కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుంది.

త్రివిక్రమ్ ని 'గారు' అని ఎందుకు పిలవాలి

Show comments