పాయల్ కు ఇంకా బుద్ధి రాలేదా!

ఆర్ఎక్స్100తో తెచ్చుకున్న క్రేజ్ మొత్తాన్ని ఆర్డీఎక్స్ లవ్ తో పోగొట్టుకుంది పాయల్. ఆ సినిమాలో పచ్చి డైలాగులు, బూతు సన్నివేశాలతో ఆమెపై బాగానే విమర్శలు చెలరేగాయి. దానికి కారణం, అదే టైమ్ లో ఆమె వెంకటేష్ సరసన వెంకీమామ సినిమా చేస్తోంది. ఓవైపు వెంకటేష్ తో సినిమా చేస్తూ, మరోవైపు ఈ బూతు సినిమా ఏంటంటూ అప్పట్లో సోషల్ మీడియాలో ఆమెపై తెగ విమర్శలు వచ్చాయి. అయితే పాయల్ మరోసారి అలాంటి సినిమాకు ఓకే చెప్పి అందర్నీ షాక్ కు గురిచేసింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రవితేజ సరసన డిస్కోరాజా సినిమా చేస్తోంది. అయినప్పటికీ మరో సి-గ్రేడ్ సినిమాలో నటించేందుకు అంగీకరించింది. ఆర్డీఎక్స్ లవ్ తరహాలోనే పైకి సందేశాత్మకంగా చూపిస్తూనే, లోపల బాగా మసాలా దట్టించిన సినిమా ఇది. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రాబోతోంది. ఇలాంటి టైమ్ లో పాయల్ ఎందుకిలాంటి సినిమాలు అంగీకరిస్తుందనేది ఆశ్చర్యకరంగా మారింది.

నిజానికి పాయల్ కు పెద్దగా అవకాశాలు రావడం లేదు. వెంకీమామ, డిస్కోరాజా మినహాయిస్తే ఆమె కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాల్లేవ్. అంతెందుకు, డిస్కోరాజా తర్వాత ఆమె చేతిలో మరో తెలుగు సినిమా లేదు. అందుకేనేమో పాయల్ ఇలా మసాలా సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. మరోవైపు ఈ తరహా సినిమాలతో ఆమె బాగానే రెమ్యూనరేషన్ తీసుకుంటోందనే టాక్ కూడా వినిపిస్తోంది. మరికొందరు మాత్రం ఆమె ఏ సినిమా పడితే ఆ సినిమాకు కమిట్ అవ్వకుండా, కొన్నాళ్లు వెయిట్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

త్రివిక్రమ్ ని 'గారు' అని ఎందుకు పిలవాలి

Show comments