పారితోషికం విష‌యంలో ఆ హీరోయిన్ రేంజ్ పెరుగుతోంది!

ఒక‌వైపు 'ఇస్మార్ట్ శంక‌ర్' విజ‌యంతో ఉత్సాహంతో ఉన్న న‌భా న‌టేష్ ఇప్పుడు మ‌రో సినిమాతో రెడీ అవుతోంది. తెలుగులో త‌న తొలి సినిమా న‌న్నుదోచుకుందువ‌టే తోనే న‌ట‌న విష‌యంలో ఆక‌ట్టుకున్న ఈ హీరోయిన్ కు ఆ త‌ర్వాత విజ‌యం కూడా ద‌క్కింది. ఈ క్ర‌మంలో ఇప్పుడు ఈమె ర‌వితేజ సినిమాలో ఛాన్స్ పొంది, ప్రేక్ష‌కుల‌ను  ప‌ల‌క‌రించ‌డానికి రెడీ అవుతోంది. 'డిస్కోరాజా'లో ఒక హీరోయిన్ గా న‌టించింది న‌భా. 

వాస్తవానికి ఈమె కెరీర్ క‌న్న‌డ‌ సినిమాల‌తో ప్రారంభం అయ్యింది. అక్క‌డ పెద్ద సినిమాల్లోనే న‌టించిన.. ఎంతైనా అక్క‌డ రెమ్యూన‌రేష‌న్ త‌క్కువే. అయితే తెలుగు సినిమాల్లో హిట్ కొట్టిన హీరోయిన్ రెమ్యూన‌రేష‌న్ ఊపందుకుంటుంది క‌దా! ఇప్పుడు న‌భా న‌టేష్ కు కూడా కాలం అలానే క‌లిసి వ‌స్తోంద‌ని స‌మాచారం.

మూడు తెలుగు సినిమాల ఎక్స్ పీరియ‌న్స్ తో ఈమె 80 ల‌క్ష‌ల క్ల‌బ్ లో చేరుతోంద‌ని స‌మాచారం. ఇస్మార్ట్ శంక‌ర్ తో వ‌చ్చిన గుర్తింపుతో ఈమెకు డిస్కోరాజా లో స్థానం ద‌క్కింది. ఇప్పుడు ఈ గుర్తింపుతో త‌ర్వాతి సినిమాల‌కు భారీ రెమ్యూన‌రేష‌న్ అందుకుంటున్న జాబితాలో చేరుతోంద‌ట న‌భా. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా న‌టించ‌బోయే సినిమాలో న‌భా న‌టేష్ న‌టించ‌నుంద‌ని స‌మాచారం. అస‌లే బెల్లంకొండ సినిమాలంటే హీరోయిన్ల‌కు భారీ రెమ్యూన‌రేష‌న్ ఖ‌రారే. ఈ క్ర‌మంలో న‌భా 80 ల‌క్ష‌ల క్ల‌బ్ లో  చేర‌బోతోంద‌ని  తెలుస్తోంది.

Show comments