పెళ్లి కాకుండానే త‌ల్లి కానున్న‌ బాలీవుడ్ న‌టి

ప్రముఖ బాలీవుడ్ న‌టి క‌ల్కి కొచ్లిన్ త్వ‌ర‌లో ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నున్నారు. కానీ ఆమె పెళ్లి చేసుకోకుండా, బాయ్ ఫ్రెండ్‌తో డేటింగ్‌లో ఉంటూనే గ‌ర్భందాల్చింది. ఇదే ఇప్పుడు హాట్ టాఫిక్‌. తాను హ‌ర్ష్‌బెర్గ్‌తో డేటింగ్‌లో ఉన్న‌ట్టు తెలిపారు. క‌రీనాక‌పూర్ రేడియో షోలో పాల్గొన్న ఆమె త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను పంచుకున్నారు.

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్‌తో మూడేళ్లు ప్రేమ‌లో మునిగిపోయాన‌న్నారు. ఆ త‌ర్వాత 2011లో పెళ్లి చేసుకున్న‌ట్టు తెలిపారు. రెండేళ్ల‌కు మించి త‌మ వైవాహిక బంధం కొన‌సాగ‌లేద‌ని చెప్పారామె. 2013లో స్నేహ‌పూర్వ‌క వాతావ‌ర‌ణంలో విడిపోయిన‌ట్టు క‌ల్కి వెల్ల‌డించారు. అయితే 2015లో అధికారికంగా విడాకులు తీసుకున్న‌ట్టు ఆమె తెలిపారు. కానీ అనురాగ్‌తో స్నేహాన్ని కొన‌సాగిస్తున్న‌ట్టు ఆమె తెలిపారు.

అనురాగ్‌తో అనుకోకుండా విడాకుల‌కు దారి తీసింద‌ని తెలిపారామె. 25 ఏళ్ల వ‌య‌స్సులో తాను అనురాగ్‌ను పెళ్లి చేసుకున్నాన‌ని, త‌మ ఇద్ద‌రి మ‌ధ్య వ‌య‌స్సు తేడా కొంత గ్యాప్‌కు కార‌ణ‌మై ఉండొచ్చ‌ని తెలిపారామె. బ‌హుశా ఈ వ‌య‌స్సు నిర్ణ‌యాల‌కు స‌రైంది కాద‌మోన‌ని ఆమె అన్నారు.

ప్ర‌స్తుతం తాను హ‌ర్ష్‌బెర్గ్‌తో డేటింగ్‌లో ఉంటూ గ‌ర్భందాల్చిన‌ట్టు తెలిపారు. త‌న ప్రెగ్నెన్సీ ఎవ్వ‌రికీ తెలియ‌కూడ‌ద‌ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్టు ప‌లు ఇంట‌ర్వ్యూల్లో ఆమె తెలిపారు. అయితే త‌న మేక‌ప్ మ్యాన్ వ‌ద్ద మాత్రం దాచ‌లేక‌పోయాన‌న్నారు. త‌న విజ్ఞ‌ప్తి మేర‌కు మేక‌ప్ మ్యాన్ త‌న‌ను జాగ్ర‌త్త‌గా చూసుకున్నాడ‌ని గ‌తంలో పేర్కొన్న విష‌యం తెలిసిందే. నాలుగో నెల వ‌చ్చేస‌రికి అంద‌రూ ప‌సిగ‌ట్టార‌ని తెలిపారామె. తాను ప్రెగ్నెన్సీ అని తెలిసి బాలీవుడ్ హ్యాపీగా ఫీల్ అయింద‌ని, కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం పెళ్లి కాకుండా ఇలాంటివి ఏంట‌ని ట్రోల్ చేశార‌ని ఆమె వాపోయిన సంగ‌తి తెలిసిందే.

ఎవ‌రేమి అనుకున్నా తాను ప్రెగ్నెంట్ అయ్యాన‌ని తెలిసి  బాయ్‌ఫ్రెండ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడని, త్వ‌ర‌లో పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్నాన‌ని క‌ల్కి కొచ్లిన్ ఆనందంతో చెప్పారు.

ఈమధ్య ఆ సినిమాలకీ ఆదరణ పెరుగుతుంది

Show comments