మరో కీలక నిర్ణయం తీసుకున్న జగన్

నవనిర్మాణ దీక్షలు.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కనిబెట్టిన ఎన్నో పదప్రయోగాల్లో ఇదీ ఒకటి. ఈ దీక్షల పేరిట బాబు చేసిన అరాచకాలు, ఆడిన డ్రామాలు అన్నీ ఇన్నీ కావు. వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆవిరి చేశారు. ఓవైపు తెలంగాణ ప్రజలు నూతన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంటే, మరోవైపు దానికి పోటీగా నవనిర్మాణ దీక్షలు ప్రారంభించారు బాబు. ఎలాంటి ఎజెండా లేకుండా కేవలం ఇగోలకు పోయి పెట్టిన ఈ దీక్షలతో, రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పూర్తిగా పక్కనపెట్టారు.

నాలుగేళ్ల పాటు రాష్ట్రానికి అవతరణ దినోత్సవాన్ని కూడా జరపలేదు చంద్రబాబు. దీనిపై అప్పట్లోనే కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఉనికిని కోల్పోకుండా ఉండాలంటే.. గతంలో లాగానే నవంబర్ 1న అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని సూచించింది. అంతేకాదు.. పాత రాష్ట్రం నుంచి కొత్త రాష్ట్రాలు విడిపోయినప్పుడు పాత రాష్ట్రాలు ఇదే విధానాన్ని అనుసరించాయని, ఉదాహరణలు కూడా ఇచ్చింది. కానీ కేంద్రం మాటని బాబు పట్టించుకోలేదు. తన రాజకీయాల కోసం కోట్ల రూపాయలు ఖర్చుచేశారు.

ఇప్పుడీ విధానానికి ముఖ్యమంత్రి జగన్ స్వస్తి పలకబోతున్నారు. ప్రజాభీష్టం మేరకు, కేంద్రం సూచనను అనుసరించి.. ఎప్పట్లానే నవంబర్ 1నే అవతరణ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 21న దీనిపై ఉన్నతాధికారులతో ఓ సమావేశం నిర్వహించి, ఆ తర్వాత ప్రకటన చేయబోతున్నారు. అధికారంలోకి వచ్చిన ఈ 4 నెలల్లో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం, నాలుగేళ్లుగా నలుగుతున్న రాష్ట్ర అవతరణ దినోత్సవంపై కూడా ఇలా చకచకా నిర్ణయం తీసుకున్నారు. 

నేను డైరెక్టర్.. తమ్ముళ్లు ఒకడు హీరో.. మరోడు ప్రొడ్యూసర్

Show comments