హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్

దేశవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం ప్రభావం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిందన్న సమాచారం వచ్చింది. హైదరాబాద్ శివారులలో జోరుగా సాగవలసిన భూముల క్రయ, విక్రయాలు తగ్గుముఖం పట్టాయట. రిజిస్ట్రేషన్ లు తగ్గాయని చెబుతున్నారు. హైదరాబాద్‌ సౌత్‌ పరిధిలో మేలో 3,337, జూన్‌లో 3,092, జూలైలో 3,764, ఆగస్టులో 4,103 రిజిస్ర్టేషన్లు జరిగితే.. సెప్టెంబర్‌లో కేవలం 2,614 రిజిస్ర్టేషన్లు జరిగాయి.

రంగారెడ్డి జిల్లాలో జూలైలో 31,903, ఆగస్టులో 29,652 రిజిస్ర్టేషన్‌లు జరిగితే సెప్టెంబర్‌లో 27,492 రిజిస్ర్టేషన్లు అయ్యాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలతో పాటు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, నల్లగొండ, మహాబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లోనూ రిజిస్ట్రేషన్ల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయిందని ఒక మీడియా కథనాన్ని ఇచ్చింది.

అప్పుడు బ్లాక్ మెయిలర్.. ఇప్పుడు చీటర్.. రవి ప్రకాష్!

Show comments